వైఎస్ జగన్‌కు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్
ఆలోచించి చెబుతామన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి మద్దతు కూడగట్టే బాధ్యతను భుజాలపై వేసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్ చేశారు.
మండలి ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ఈ అంశంపై ఆలోచించి చెబుతామని బదులిచ్చారు. మండలి బరిలోకి దింపిన ఐదుగురు పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేటీఆర్ ఇప్పటికే సీపీఎం, సీపీఐ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతోనూ మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరిన టీఆర్‌ఎస్
Published Fri, May 29 2015 12:48 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM
Advertisement
Advertisement