
సాక్షి, తిరుపతి : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భావిస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్దం చేసింది. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులను ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వారం గుండా అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. ఈ సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహా మండలి అంగీకరించింది. ఒకవేళ పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment