తిరుమలలో అర్థరాత్రి తనిఖీలు | TTD checks midnight | Sakshi
Sakshi News home page

తిరుమలలో అర్థరాత్రి తనిఖీలు

Published Sat, Dec 13 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

తిరుమలలో అర్థరాత్రి తనిఖీలు

తిరుమలలో అర్థరాత్రి తనిఖీలు

తిరుమలలో శుక్రవారం అర్థరాత్రి టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వి. దేవేం ద్రరెడ్డి అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. రెవెన్యూ, పంచాయతీ బృందంతో కలిసి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 11.45 గంటల వరకు ప్రధాన దుకాణ సము దాయం, రావిచెట్టు, కల్యాణకట్ట, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లోని దుకాణాలను తనిఖీలు చేశారు. ఆక్రమణలను తొలగించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు సాగిస్తున్న పలు దుకాణదారులను ఆయన తీవ్రంగా మందలించారు.

నిబంధనలు పాటించకపోతే సరుకులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. తరచూ ఆక్రమణలు చేసే దుకాణదారులపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇకపై తరచూ పగలే కాకుండా రాత్రి వేళ్లల్లోనూ అన్ని విభాగాలతో కూడిన టాస్క్‌ఫోర్స్ దుకాణాలను తనిఖీ చేస్తుందని గుర్తు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యాపారాలు సాగించవద్దని, టీటీడీ నిబంధనలను పాటించాలని సూచన చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement