Devendra Reddy
-
అమెరికాలో దేవరకొండవాసి సజీవదహనం!
సాక్షి, కొండమల్లేపల్లి: అమెరికాలో నల్లగొండ జిల్లా దేవరకొండవాసి మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. దేవరకొండ మండలం కర్నాటిపల్లి గ్రామానికి చెందిన నల్లమాద నర్సిరెడ్డి, భారతమ్మ దంపతుల రెండో కుమారుడు దేవేందర్‌రెడ్డి.. 1998లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ఐటీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో తన ఇంటి వద్ద ఉన్న కారు స్టార్ట్ చేసే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర గాయాలై∙దేవేందర్‌రెడ్డి మృతి చెందినట్లు మృతుడి సోదరుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. దేవేందర్‌రెడ్డికి భార్య అనురాధ, ఏడేళ్ల కుమార్తె చెర్రి ఉంది. దేవేందర్‌రెడ్డి మృతితో సొంతూరు కర్నాటిపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయితే దేవేందర్‌రెడ్డికి మృతికి గల కారణాలు తెలుస్తాయని మృతుడి బంధువులు చెప్పారు. దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధికార ప్రతినిధి. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. -
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా దేవేంద్రరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జి.వి.దేవేంద్రరెడ్డి వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవేంద్రరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులుగా దేవేంద్రరెడ్డి ఉన్నారు. ఇంతకుముందు పార్టీ ఏపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మీడియా కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అందించినందుకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు, పార్టీ పెద్దలు రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, దివ్యారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని స్థాయిలలో పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సోషల్ మీడియా ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గాలను, అరాచకాలను లేవనెత్తుతూ ప్రజాస్వామ్యయుతంగా పోస్టులు పెట్టే పార్టీ వాలంటీర్లకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి సోషల్ మీడియా వాలంటీర్లను కలిసి వారిలో స్ఫూర్తినింపుతానని దేవేంద్రరెడ్డి అన్నారు. -
టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ బదిలీ
తిరుమల: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వి.దేవేంద్రరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)లో ఎండోమెంట్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ జనవరి 31, 2013లో టీటీడీకి వచ్చారు. దేవస్థానం రెవెన్యూ, పంచాయతీ విభాగాలను సమర్థంగా నడిపారు. దేవస్థానం పరిధిలో పేరుకుపోయిన రెవెన్యూ బకాయిలనువసూలు చేయించగలిగారు. ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టు విషయంలో ఆశావహుల జాబితా పెరిగింది. అప్పట్లో ఈయన బదిలీపై ఊహాగానాలు వచ్చాయి. ఆయన పదవీ కాలాన్ని జనవరి 2016 వరకు పెంచుతూ రెండు నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో టీటీడీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తిరుపతిలో ఉండే స్థలాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది వివాదాస్పదమైంది. ఈ తరుణంలో ఎస్టేట్ ఆఫీసర్ వి.దేవేంద్రరెడ్డి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. చడీచప్పుడు లేకుండా ఎస్టేట్ ఆఫీసర్ బదిలీ కావడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టును తమ వారికి ఇప్పించేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు బడా నేతలు రంగంలో దిగి తీవ్రస్థాయిలో పోటీపడుతున్నట్టు సమాచారం. -
తిరుమలలో అర్థరాత్రి తనిఖీలు
తిరుమలలో శుక్రవారం అర్థరాత్రి టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వి. దేవేం ద్రరెడ్డి అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. రెవెన్యూ, పంచాయతీ బృందంతో కలిసి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 11.45 గంటల వరకు ప్రధాన దుకాణ సము దాయం, రావిచెట్టు, కల్యాణకట్ట, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లోని దుకాణాలను తనిఖీలు చేశారు. ఆక్రమణలను తొలగించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు సాగిస్తున్న పలు దుకాణదారులను ఆయన తీవ్రంగా మందలించారు. నిబంధనలు పాటించకపోతే సరుకులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. తరచూ ఆక్రమణలు చేసే దుకాణదారులపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇకపై తరచూ పగలే కాకుండా రాత్రి వేళ్లల్లోనూ అన్ని విభాగాలతో కూడిన టాస్క్‌ఫోర్స్ దుకాణాలను తనిఖీ చేస్తుందని గుర్తు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యాపారాలు సాగించవద్దని, టీటీడీ నిబంధనలను పాటించాలని సూచన చేశారు. -
ఫారెస్ట్ వర్సెస్ టీటీడీ
సాక్షి, తిరుమల: తెరవెనుక కారణాలు ఏవైనా పాపవినాశం తీర్థ స్థల వివాదం మళ్లీ తెరపైకి వచ్చిం ది. రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని ఆ స్థలం తమదంటే తమదేనని ఫారెస్ట్, టీటీడీ పట్టుబడుతున్నాయి. ఈ రెండు విభాగాల మధ్య దుకాణదారులు నలిగిపోతున్నారు. శ్రీవారి దర్శన టికెట్లే కొత్త వివాదానికి కారణమని చర్చ జోరుగుతోంది. టీటీడీ దివ్యక్షేత్రం పరిధిలో ఏడు కొండలు, పది తీర్థాలు టీటీడీ రెవెన్యూ అధికారులు చెబుతున్న రికార్డుల ప్రకారం శేషాచలంలోని ఏడుకొండలు, పది తీర్థాలు దేవస్థానం పరిధిలోకి వస్తాయి. తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి ఇస్తూ ప్రభుత్వ జీవో ఎంఎస్ 659, 1941 జూన్ 16 ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఉంది. దీనికి అనుబంధంగా ప్రభుత్వ జీవో 338, పం చాయతీ (రెవెన్యూ) 2005 సెప్టెంబర్ 16 ఆ తర్వాత జీవో ఎంఎస్ నం:746, రెవెన్యూ (ఎం డోమెంట్స్3) 2007 జూన్ 2 ప్రకారం ‘తిరుమల దివ్యక్షేత్రం’గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చే సింది. దీని ప్రకా రం తిరుమల ఆలయం, ఏడుకొండలు, పది తీర్థాలు ఈ గెజిట్‌లో చేర్చారు. ఆయా తీర్థాల చు ట్టూ 200 మీటర్ల స్థలం కూడా టీటీడీ అటవీ పరిధిలోకి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ భూముల పరిధిలో సర్వహక్కులూ శ్రీవారి పే రుతో ఉన్న దేవస్థానానికే చెందుతాయని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి స్పష్టం చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్ తమదేనంటున్న ఫారెస్ట్ విభాగం శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం పరిధిలోకి వచ్చే రిజర్వు ఫారెస్ట్ ప్రాంతమంతా తమదేనని ఫారెస్ట్ విభాగం చెబుతోంది. దీనిపై టీటీడీకి ఎలాంటి హక్కూలేదని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2008లో ఆకాశగంగ తీర్థం తర్వాత రిజర్వు ఫారెస్ట్ పరిధిలో చెక్‌పోస్టు కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేస్తున్నారు. తమ పరిధిలోకి వచ్చే తీర్థాల్లో ఉన్న దుకాణాలు ఖాళీ చేయాల్సిందేనని వారు చెబుతున్నారు. నలుగుతున్న దుకాణదారులు టీటీడీ, ఫారెస్ట్ విభాగాలు ప్రతిష్టలకు పోవడంతో వారి మధ్య దుకాణదారులు నలిగిపోతున్నారు. 1983లో పాపవినాశనం డ్యాం నిర్మా ణం కాకముందే పాత పాపవినాశనంలో దుకాణాలు ఉన్నాయని, 1967 నుంచే తాము టీటీడీకి అద్దెలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. 1983 లో డ్యాము నిర్మాణం పూర్తయిన తర్వాత పాత పాపవినాశం మూసివేయడంతో అక్కడు న్న దుకాణాలను కూడా కొత్త పాపవినాశనానికి మారుస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు ఇ చ్చారు. ఆ తర్వాత షికారీలకు గిరిజన కోటా కింద హాకర్ లెసైన్సులు, దుకాణాలు కేటాయిం చారు. మూడో విడతగా తిరుమలలోని సన్నిధి వీధి విస్తరణ పనుల్లో ఇళ్లు, లెసైన్సు దుకాణాలు కోల్పోయినవారికి పాపవినాశం తీర్థంలో మొ త్తం 78 దుకాణాలు కేటాయించారు. తాజాగా దుకాణాలు ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారు లు హెచ్చరించడంతో వారు శనివారం టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, డీఆర్వో రాజేంద్రకుమార్‌కు విన్నవించి, తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వివాదానికి దర్శన టి కెట్లే కారణమా? శ్రీవారి దర్శన టికెట్లే స్థల వివాదానికి కారణమ ని చర్చ జోరుగా సాగుతోంది. ఫారెస్ట్ విభాగానికి అవసరమైన శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వలేదనే వాదనా ఉంది. టీటీడీ అధికారులు తమ ఉన్నతాధికారులకు దర్శన సమయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫారెస్ట్ అధికారులు ఆవేదన చెందుతున్నారు. స్థల వివాదాన్ని తెరపైకి తీసుకొస్తే టీటీడీ ఉన్నతాధికారులు దారికొస్తారనే ఉద్దేశంతోనే పాత వివాదానికి మళ్లీ ప్రా ణం పోసినట్టు అటు టీటీడీ, ఇటు ఫారెస్ట్ విభాగాల్లో చర్చ సాగుతుండడం కొసమెరుపు.