
శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్
సాక్షి, తిరుమల : తిరుమల వెంకన్న ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డునే. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్ లభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్ పొందింది. గతంలో లైసెన్స్ అవసరం లేదని టీడీపీ అధికారులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
అయితే బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి గతంలో లడ్డు నాణ్యతపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రసాదం రూపంలో తయారు చేస్తున్న లడ్డులో నాణ్యత లేదని, అక్కడ లడ్డూలు తయారు చేస్తున్న వారు ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాలను పాటించడం లేదని ఆరోపిస్తూ అతను లేఖలో ఫిర్యాదు చేశారు.
దీనిపై టీటీడీ వివరణ ఇచ్చినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతృప్తి చెందలేదు. తక్షణమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం లడ్డు తయారు చేయాలంటూ టీటీడీతో పాటు ఏపీ సర్కార్‌కు సూచనలు చేసింది. దీంతో టీడీపీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలను పాటించడంతో లడ్డు ప్రసాదానికి లైసెన్స్ వచ్చింది.