టీటీడీ ఆన్‌లైన్‌ విధానంలో మార్పులు | TTD Implements Caution Deposit Policy In Online Rooms Booking | Sakshi
Sakshi News home page

గదుల బుకింగ్‌లో కాషన్‌ డిపాజిట్‌ విధానం

Published Wed, Jan 15 2020 11:37 AM | Last Updated on Wed, Jan 15 2020 11:46 AM

TTD Implements Caution Deposit Policy In Online Rooms Booking  - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో గదుల బుకింగ్‌ విధానంతో మార్పులు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) వారు తెలిపారు. అద్దెగదులను ముందస్తుగా బుక్‌ చేసుకునే భక్తులు కాషన్‌ డిపాజిట్‌ చెల్లించే విధానాన్ని అమలులోకి తెసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో గదులు బుక్‌ చేసుకుంటే అదనంగా అంతే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు గదిని ఖాలీ చేసే సమయంలో డిపాజిట్‌ నుతిరిగి ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెలఖరు నాటికి ఆఫ్‌ లైన్‌ బుకింగ్‌ విధానంలోనూ అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. కాగా ప్రస్తుత ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే భక్తులకు కూడా ఇది వర్తిసున్నట్లు టీటీడీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement