మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తుంగభద్ర డ్యాం నుంచి ఆర్‌డీఎస్ (రాజోలిబండ మళ్లింపు పథకం)కు సాగు నీరు విడుదలను బంద్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు కింద దాదాపు 30 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగు నీరు ఇవ్వాలని ఈ నెల 7వ తేదీన నిర్వహించిన సాగునీటి పారుదల సలహా సంఘం (ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న 15 రోజుల్లోపే నీరు బంద్ కావడం విశేషం. సమావేశంలో మార్చి 15వ తేదీ వరకు మాత్రమే నీళ్లు ఇవ్వనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ముందుగా ప్రకటించారు.
అరుుతే పంటలు చేతికందడం కష్టమని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ప్రశ్నించడంతో మంత్రి డీకే అరుణ జోక్యం చేసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీని పొడిగిస్తూ హామీనిచ్చారు. అయితే ఇప్పటి వరకు తుంగభద్ర నదిలో వస్తున్న నీటిని మాత్రమే వాడుకుంటున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి ఆర్‌డీఎస్‌కు రావాల్సిన 4.5 టీఎంసీల వాటా విడుదలలో అధికారులు ఇండెంట్ పెట్టలేకపోయూరు. ఈ కారణాలతో తుంగభద్ర డ్యాం అధికారులు నీటి సరఫరాను బంద్ చేశారనే వాదన విన్పిస్తోంది. ఆర్‌డీఎస్ కాలువలు వెలవెలబోతుండంతో రైతులు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలోని హెచ్‌ఎల్సీ (తుంగభద్ర ఎగువ కాలువ)కి తుంగభద్ర డ్యాం నుంచి అదనంగా 10 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతులు అయ్యూరు. అలాగే ఆర్‌డీఎస్‌కు విడుదల చేయాల్సిన నీటి కేటాయింపులో 2 టీఎంసీల మేర కోత విధించి కర్నూలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవ్వాలని కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే అలంపూర్ నియోజకవర్గంలో సాగు చేసిన 30 వేల ఎకరాల పంట దెబ్బతినడంతో పాటు ఆ నియోజకవర్గంలోని దాదాపు 30 గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్దగా పట్టించుకోక పోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నం అవుతోందనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ముఖ్యంగా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం స్పందించాల్సి ఉన్నా.. ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. ఇటీవల నిర్వహించిన ఐఏబీ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. అరుుతే కర్నూలు జిల్లాలో ఉన్న కేసీ కెనాల్‌కు, జిల్లాలోని ఆర్‌డీఎస్‌కు నీటి విడుదలకు సంబంధించి కర్నూలు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులే ఇండెంట్ పెట్టకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది.
నీరు బంద్
Published Sun, Dec 22 2013 4:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement