హత్యకేసులో ఇద్దరి అరెస్ట్ | Two arrested in murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఇద్దరి అరెస్ట్

Published Tue, Dec 22 2015 5:39 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

Two arrested in murder case

కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను కడప పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కడప నగరంలోని దేవుని కడప రోడ్డులో కేసీ కెనాల్ కట్ట వద్ద ఈ నెల 17న సాధిక్‌ వలీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో షేక్ జాఫర్(25), వల్లెపు నట్టేశ్వరరావు(28) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

చనిపోయిన సాధిక్ వలీతో పాటు అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులు కడప నగరంలో తరచూ దొంగతనాలు చేస్తుండేవారు. దొంగిలించిన సొమ్ము పంపకాల్లో విభేదాలు రావడంతో ఈ హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. కడప డీఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement