'శుభదర్శి' కేసులో మరో ఇద్దరి అరెస్ట్!
Published Wed, Jul 16 2014 3:15 PM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
విజయవాడ: శుభదర్శి చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మరో ఇద్దర్ని బుధవారం అరెస్ట్ చేశారు. 20 కోట్ల రూపాయల మేరకు బకాయిలున్నట్లు నిందితులు చెబుతున్నారని ఏసీపీ లావణ్యలక్ష్మీ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు 120 మంది బాధితుల ఫిర్యాదుతో 9 కోట్ల మేర మోసం జరిగినట్లు గుర్తించామన్నారు.
ఈ కుంభకోణానికి పాల్పడిన యాజమాన్యానికి చెందిన ఆస్తులను గుర్తించామని ఏసీపీ లావణ్యలక్ష్మీ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ లావణ్యలక్ష్మీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
విజయవాడ లబ్బిపేటలోని శుభదర్శి చిట్ఫండ్ కంపెనీ మంగళవారం బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement