వర్గల్ /తూప్రాన్, న్యూస్‌లైన్: వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం నుంచి గురువారం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని సుభాష్‌నగర్ (అల్వాల్)కు చెందిన సూరజ్‌కారి కరుణ, నాగరాజు దంపతులు తమ ఇద్దరు పిల్లలు రాజేశ్వరి (7), ధనుష్ (5)లతో బుధవారం రాత్రి దైవ దర్శనార్థం బైక్ మీద నాచగిరి క్షేత్రానికి వచ్చారు. రాత్రి సత్రాల వద్ద నిద్రించారు. ఉదయం బైక్ చెడిపోవడంతో పక్కనే ఉన్న అపరిచిత దంపతులకు కొద్దిసేపు తమ పిల్లలను చూడాలని అప్పజెప్పి నాగరాజు దంపతులు నాచారం గ్రామంలోకి వెళ్లారు. బైక్ బాగు చేయించుకుని సత్రాల వద్దకు చేరుకోగా అపరిచిత దంపతులతో పాటు తమ పిల్లలు కూడా కన్పించలేదని బోరుమన్నారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక లేదన్నారు. దీంతో నాచగిరి ఆలయ అధికారులకు సాయం కోసం అర్థించామన్నారు. తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఇద్దరు చిన్నారుల అదృశ్యం
Published Fri, Feb 21 2014 2:56 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement