సముద్రస్నానానికెళ్లి ఇద్దరు మృతి | Two die at Perupalem beach | Sakshi
Sakshi News home page

సముద్రస్నానానికెళ్లి ఇద్దరు మృతి

Published Fri, Jul 17 2015 7:35 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

Two die at Perupalem beach

పశ్చిమ గోదావరి (మొగల్తూరు) : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద శుక్రవారం సముద్ర సాన్నానికెళ్లిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. నర్సాపురం మండలం రాయిపేటకు చెందిన గంగాధర ముర ళీకృష్ణ(35), రాకేష్ కాశి(18)లు ప్రమాదవశాత్తు మరణించారు.

మురళీకృష్ణ బెంగుళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, రాకేష్ స్థానికంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement