Perupalem beach
-
ఏపీలో కనువిందు చేసే ఆకర్షణీయమైన బీచ్‌లు (ఫొటోలు)
-
తెల్లారితే చెల్లి పెళ్లి.. ఇళ్లంతా హడావుడి.. అంతలో
మొగల్తూరు: తెల్లారితే చెల్లి పెళ్లి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. స్నేహితులతో సరదాగా బీచ్‌కు వచ్చిన యువకుడు, అతని స్నేహితుడు నీటిలో మునిగి మృత్యువాత పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వజ్జిపోతు సత్యనారాయణ కుటుంబం హైదరాబాద్‌లోని దిండిగల్‌లో స్థిరపడింది. వారి కుమార్తె వజ్జిపోతు ఆశాజ్యోతికి ఇటీవల వివాహం నిశ్చయించగా, తమ సొంత ఊరైన పాలకొల్లులోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా కలిసి పాలకొల్లు వచ్చారు. బుధవారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమార్తె అన్న వజ్జిపోతు రాజేష్ (22), నిజాంపేటకు చెందిన అతని స్నేహితుడు బండారు వినయ్ (16) మరో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేరుపాలెం బీచ్‌కి వచ్చారు. స్నానానికి దిగిన రాజేష్, వినయ్ నీటిలో గల్లంతవడంతో అతని స్నేహితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో వారి కోసం గాలింపు చేపట్టగా, రాజేష్ మృతదేహం లభించింది. కొన ఊపిరితో ఉన్న వినయ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుమార్తె పెళ్లి వేళ కుమారుడు శాశ్వతంగా దూరమవడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, నాగవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
తీరానికి అందాల హారం! బీచ్‌లలో ఆధునిక సదుపాయాలు.. పోటీలు షురూ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఆప్టా) చర్యలు చేపడుతోంది. బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌కు అనుగుణంగా పర్యావరణ హితంగా, అందంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో ఆధునిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రాజెక్టు డిజైన్ల కోసం ఆర్కిటెక్ట్ పోటీలను నిర్వహిస్తోంది. ఆర్కిటెక్ట్ సంస్థలతోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ (సీవోఏ)లో రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ)లో రిజిస్టర్డ్ ప్లానర్లు, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల (వ్యక్తిగత/బృందాలుగా)నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి ఉత్తమ ఆర్ఎఫ్పీలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించనుంది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాలను https://tourism.ap.gov.in/tenders వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభివృద్ధి ప్రణాళిక ఇలా... తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో సుమారు 1,500 మీటర్లు చొప్పున అభివృద్ధి చేయనున్నారు. ఈ బీచ్‌లను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతోపాటు స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వ్యూ పాయింట్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, టూరిస్ట్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ రిసెప్షన్ సెంటర్, రెస్క్యూ, వైద్య సౌకర్యాలు, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. మరోవైపు పశ్చిమగోదారి జిల్లా పేరుపాలెంలో 104 ఎకరాల్లో, పల్నాడు జిల్లా నాగులవరంలో 250 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో బీచ్ కాటేజీలు, హోటళ్లు, రిసార్ట్స్, సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్లు, థీమ్ పార్క్, వ్యూ పాయింట్లు, టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వంటివి ఆధునిక సౌకర్యాలో ఏర్పాటు చేయనున్నారు. నగదు బహుమతులు ఇలా.. ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి వచ్చిన మొదటి మూడు ఉత్తమ ఎంపికలకు రూ.1,50,000, రూ.1,00,000, రూ.75,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. సీవోఏ రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఐటీపీఐ రిజిస్టర్డ్ ప్లానర్ నుంచి వచ్చిన ఉత్తమ డిజైన్లకు రూ.1,00,000, రూ.75,000, రూ.55,000 చొప్పున, విద్యార్థి విభాగంలో విజేతలకు రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రతిభగల ఆర్కిటెక్ట్‌లకు ఆప్టాతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
పేరుపాలెం బీచ్.. పర్యాటకం భేష్
సాక్షి, నరసాపురం: జిల్లాలో ఆహ్లాదానికి, ప్రకృతి రమణీయతకు ఆలవాలం పేరుపాలెం బీచ్.. ఏ ఇతర బీచ్‌లకు కూడా తీసిపోని కనువిందు చేసే దృశ్యాలు పేరుపాలెం సొంతం. తీరం పొడవునా కొబ్బరి చెట్లు, మతసామరస్యానికి ప్రతీకగా వివిధ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. పేరుపాలెం బీచ్ సోయగం వర్ణించడానికి మాటలు చాలవు. అయితే అనుకున్నంత ప్రచారం లేకపోవడం, మౌలిక వసతుల లేమితో ఆశించినంత అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గద్దెనెక్కిన తొలినాళ్లలోనే పర్యాటకరంగం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో 2020 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పేరుపాలెంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి బాటలు వేయడానికి ఈ వేడుక ఉపయోగపడింది. బీచ్ అభివృద్ధికి ప్రస్తుతం వడివడిగా అడుగులు పడుతున్నాయి. కరోనా కల్లోలం లేకపోతే ఇప్పటికే బీచ్ మరింత అభివృద్ధి చెందేది. చదవండి: (కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం) వేగంగా రిసార్టుల నిర్మాణాలు పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లను అభివృద్ది చేసేందుకు ఏడాది క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యియి. పర్యాటకుల వసతి కోసం లగ్జరీ హోటల్ నిర్మాణానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రిసార్టులు నిర్మించారు. మరికొన్ని రిసార్టులతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపడడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల టూరిజం శాఖ రీజనల్ డైరక్టర్ తీరప్రాంతంలో పర్యటించి నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించారు. ఇప్పటికే పేరుపాలెం బీచ్ నుంచి కేపీపాలెం బీచ్ వరకు ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారిని డబుల్ రోడ్‌గా విస్తరిస్తూ పనులు ప్రారంభించారు. రూ 8. కోట్లతో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బీచ్‌లో రిసార్ట్స్ బ్లూఫాగ్ గుర్తింపుతో మరింత అభివృద్ధి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్లూఫాగ్ బృందం తీరంలో పర్యటించింది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ బీచ్ అనుకూలంగా ఉందని బృందం నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లూఫాగ్ సర్టిఫికేషన్‌పై దృష్టిపెట్టింది. చదవండి: (దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు) అప్పుడు వైఎస్..ఇప్పుడు జగన్ బీచ్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణం. 2004 సునామీ తరువాత బాధితుల కోసం తీరంలో ఇళ్లు నిర్మించారు. 2007లో వాటిని ప్రారంభించడానికి వచ్చిన వైఎస్ పేరుపాలెం బీచ్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. అప్పుడు బీచ్ అభివృద్ధి ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే ముదునూరి ద్వారా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు బీచ్ అభివృద్ధికి రూ 2.80 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో రివిట్‌మెంట్‌తో కలిపి రోడ్డు వేశారు. గెస్ట్‌హౌస్ నిర్మించారు. అప్పటి నుంచి బీచ్‌కు జనం రాకపోకలు పెరిగాయి. రిసార్టుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 10 ఏళ్లలో పాలకులు బీచ్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీచ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో రూపురేఖలు మారిపోతాయి గతేడాది బీచ్ ఫెస్టివల్ పేరుపాలెంలో జరగడం ముందడుగుగా భావించాలి. ముఖ్యమంత్రి బీచ్ అభివృద్ధికి సహకరిస్తున్నారు. భవిష్యత్‌లో బీచ్ రూపురేఖలు పూర్తిగా మారుస్తాం. కరోనా వల్ల అభివృద్ధి పనులకు కొంత ఆటకం కలిగింది. త్వరలో హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణాలు చేపడతాం. -ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే -
టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
సాక్షి, నరసాపురం: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం పేరుపాలెంలో రెండు రోజులపాటు జరిగే బీచ్ ఫెస్టివల్ శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ సభలో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పశి్చమగోదావరి జిల్లా పేరు చెబితేæ ఆతిథ్యానికి ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు. ఆతిథ్యానికి, టూరిజానికి అవినావభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. మన జిల్లాలో టూరిజం అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. కార్తీకమాసంలో పేరుపాలెం బీచ్‌కు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం త్వరలో ఈ ప్రాంతంలో భారీ శివాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఏటా ఫిబ్రవరిలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. బీచ్ అభివృద్ధికి కృషి : రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ఉన్న పేరు పాలెం బీచ్ ప్రచారానికి నోచుకోక అన్ని విధాలుగా వెనుకబడిపోయిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ బీచ్‌ను జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తామని, దేశంలో పేరున్న బీచ్‌లకు పేరుపాలెం బీచ్ ఏ మాత్రం తీసిపోదని చెప్పారు. అధిక ఆదాయాన్ని సమకూర్చే రంగాల్లో టూరిజం అభివృద్ధి కూడా ప్రధానమైందన్నారు. జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న బీచ్ ఫెస్టివల్‌ను ఈస్థాయిలో నిర్వహించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. శివాలయం నిర్మిస్తాం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ముందడుగు వేస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రణాళిక తయారవుతుందని పేర్కొన్నారు. బీచ్‌లో శివాలయాన్ని నిర్మిస్తామని, దీనికి శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల సహకారం తీసుకుంటామన్నారు. 10 బీచ్‌ల అభివృద్ధికి ప్రణాళిక పర్యాటకశాఖ సీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రుషికొండ, ఆర్కే బీచ్‌ల తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఉన్న మరో 10 బీచ్‌లను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ నిర్ణయించిందన్నారు. పేరుపాలెం బీచ్ కూడా టూరిజం శాఖ గుర్తించిన బీచ్‌లలో ఉందన్నారు. రాబోయే కాలంలో పేరుపాలెం బీచ్‌ను రూ.5 కోట్ల నుంచి 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేరళ మాదిరి ప్రకృతి సోయగం సభకు అధ్యక్షత వహించిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ కూడా పేరుపాలెం బీచ్‌లో కనిపిస్తాయన్నారు. కేరళలో కూడా లేనివిధంగా ఇక్కడి తీరం పొడవునా కొబ్బరి చెట్లు దర్శనమిస్తాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో నరసాపురం తీరాన్ని పర్యాటకంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో పేరుపాలెం బీచ్‌కు విదేశీ పర్యాటకులు వచ్చేస్థాయిలో అభివృద్ధి ఉంటుందన్నారు. కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న బీచ్ ఫెస్టివల్‌కు మొదటి రోజే అనూహ్య స్పందన వచ్చిందన్నా రు. మంత్రులు, ఇతర అతిథులు ముందుగా గాలిలో పా వురాలు ఎగరేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే వీ ఆర్ ఎలీజా, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, ఉండి ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత చెల్లం ఆనంద ప్రకాషం, పార్టీ కేంద్ర మండలి సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి ‘కెరటం’
మొగల్తూరు/భీమవరం అర్బన్ : పుట్టిన రోజు వేడుకను స్నేహితులతో కలిసి ఆనందంగా బీచ్‌లో జరుపుకుందామని వెళ్లిన ఆ విద్యార్థి కుటుంబాన్ని విషాద కెరటం ముంచెత్తింది. ముగ్గురు స్నేహితులను కడలి కబళించింది. మూడు కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. చేతికి అందివచ్చిన కొడుకులను మృత్యు అల బలి తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. భీమవరం మండలం గూట్లపాడుకు చెందిన కారుమూరి సాయితేజ (22), కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన మంతెన భాను ప్రకాష్ (22) భీమవరం డీఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. గూట్లపాడుకు చెందిన మరో విద్యార్థి రేవు రాజేష్ (17) అదే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరు ముగ్గురూ స్నేహితులు. వీరు ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయి తేజ పుట్టిన రోజు కావడంతో పేరుపాలెం బీచ్‌లో వేడుకలు జరుపుకోవాలని తలంచారు. దీంతో సాయితేజ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆటోలో బీచ్‌కు వచ్చాడు. అతని స్నేహితులు సుమారు 15 మంది మోటార్‌సైకిళ్లపై బీచ్‌కు వచ్చారు. మధ్యాహ్నం వీరంతా కలిసి సముద్రస్నానం చేశారు. ఆ తర్వాత సేదదీరారు. అనంతరం సాయితేజ, రాజేష్, భానుప్రకాష్ తిరిగి స్నానానికి వెళ్లారు. ఈ సమయంలో అలల ఉధృతికి కొట్టుకుపోయారు. ఆ తర్వాత వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. వీరి మృతదేహాలను రోడ్డు వరకూ ఆటోలో, ఆతర్వాత 108లో నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుట్టినరోజు నాడే సాయితేజ తండ్రి సూర్యనారాయణ కిరాణా వ్యాపారం చేస్తుంటారు. ఎనిమిదేళ్ల క్రితం ఆయన కుటుంబంతో సహా గూట్లపాడుకు వలస వచ్చారు. సాయితేజాకు తల్లి శ్రావణి, చెల్లెలు ఉన్నారు. బుధవారం అతని పుట్టినరోజు కావడంతో పేరుపాలెం బీచ్‌లో వేడుక చేయాలని తల్లిదండ్రులు తలంచారు. కొడుకును కెరటాలు బలితీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితుని పుట్టినరోజుకెళ్లి : రేవు రాజేష్ తండ్రి ఏడుకొండలు కూలిపనులు చేస్తూ.. ఇంటిని గడుపుతున్నాడు. కష్టపడి కొడుకును ఇంటర్మీడియెట్ చదివిస్తున్నాడు. రాజేష్‌కు తల్లి మావుళ్లమ్మ, చెల్లెలు ఉన్నారు. రాజేష్ స్నేహితుడు సాయితేజ పుట్టిన రోజు వేడుకలకని బీచ్‌కు వెళ్లి విగతజీవిగా మారాడు. దీంతో అతని తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. కొడుకు మరణ వార్త విన్న రాజేష్ తల్లి మావుళ్లమ్మ స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను వెనువెంటనే బంధువులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. -
సముద్రస్నానానికెళ్లి ఇద్దరు మృతి
పశ్చిమ గోదావరి (మొగల్తూరు) : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద శుక్రవారం సముద్ర సాన్నానికెళ్లిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. నర్సాపురం మండలం రాయిపేటకు చెందిన గంగాధర ముర ళీకృష్ణ(35), రాకేష్ కాశి(18)లు ప్రమాదవశాత్తు మరణించారు. మురళీకృష్ణ బెంగుళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, రాకేష్ స్థానికంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేరుపాలెం బీచ్‌లో 20ఏళ్ల బాలరాజు గల్లంతు