హైదరాబాద్: స్నేహం ముసుగులో మిత్రుని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకొని తిరిగి అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కూకట్‌పల్లికి చెందిన మనోజ్‌కుమార్ అనే వ్యాపారికి సైనిక్‌పురి, డిఫెన్స్‌కాలనీకి చెందిన సంతోష్‌కుమార్ స్నేహితుడు. తాను ఇళ్లు కట్టుకుంటున్నానని, మూడు నెలల్లో తిరిగి డబ్బులు ఇస్తానని గతేడాది సెప్టెంబర్‌లో మనోజ్‌కుమార్ నుంచి సంతోష్‌కుమార్ రూ.45 లక్షలను అప్పుగా తీసుకున్నాడు.
సంతోష్ స్నేహితుడైన అమీర్‌పేట్‌కు చెందిన సత్యనారాయణను మనోజ్‌కుమార్‌కు పరిచయం చేసి.. అతను ఇళ్లు కట్టుకుంటున్నాడు అతనికి డబ్బు అవసరం ఉందంటూ నమ్మబలికి రూ. 25 లక్షలు ఇప్పించాడు. ప్రస్తుతం డబ్బులు అడిగితే మనోజ్‌కుమార్‌ను ఇద్దరు కలిసి బెదిరించారు. దీంతో మనోజ్‌కుమార్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
అప్పు తీర్చమంటే బెదిరింపులు
Published Wed, May 14 2014 8:48 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement