పుట్లూరు (అనంతపురం): ఆటో, బైకు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో పుట్లూరు- తాడిపత్రి రహదారిపై ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. ఎదురెదురుగా వేగంగా వచ్చిన ఆటో, మోటారు సైకిల్ ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పుట్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.