విద్యుదాఘాతం రూపంలో మృత్యువు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలతో రెండు కుటుంబాలు మగ దిక్కును కోల్పోయాయి. కురుపాం మండలం రస్తాకుంటుబాయి సమీపంలో 33 కేవీ విద్యుత్ లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సరఫరా కావటంతో కాంట్రాక్ట్ లైన్‌మెన్ ఒకరు మరణించారు. చీపురుపల్లిలోని ఓ ఇంటిలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ మోటార్ వద్ద షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు.
ముగ్గురు ఆడపిల్లల తండ్రి మృతి
చీపురుపల్లి: స్థానిక ఆంజనేయపురంలోని ఓ ఇంటిలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో కన్నుమూశారు. నాలుగు పదుల వయసులోనే మృత్యువాత పడటంతో కట్టుకున్న భార్య, ముగ్గురు కుమార్తెలు అనాధలయ్యారు. ఇకపై తమను పోషించే ది ఎవరని, ముగ్గురు కూతుళ్లకు వివాహం ఎలా చేయాలంటూ భార్య, బంధువులు బోరున విల పించారు. పరిహారం చెల్లించాలంటూ ఘటన జరిగిన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నేతలు జోక్యంతో ఇంటి ప్రస్తుత, గత యజమానులు రూ.6 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు.
ఇదీ జరిగింది: గరివిడి బీసీ కాలనీకి చెందిన దన్నాన శ్రీను అలియాస్ రాజు(40) ఆంజనేయపురంలోని ఇంటిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఇంటిని ఎ.ఎస్.వి.ప్రసాద్ అనే మైనింగ్ పరిశ్రమ యజమాని ప్రముఖ వ్యాపారి గుడ్ల నర్శింహమూర్తికి ఇటీవల విక్రయించారు. ఈ నెల 15న రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. శ్రీను మూడు రోజులకు ఒకసారి వచ్చి ఇంటిని, ఆవరణను శుభ్రం చేసి వెళుతుంటారు. శనివారం ఉదయం 6.30 గంటలకు వచ్చిన శ్రీను నీటి మోటారు వద్ద విద్యుదాఘాతం తగలటంతో మరణించాడు. అదే భవనంలో పని చేస్తున్నవారు మృతుడి ఇంటికి సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీను మృతదేహాన్ని చూసి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని భీష్మించారు. వారి ఆందోళనతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గరివిడి ఎస్‌ఐ కృష్ణవర్మ, చీపురుపల్లి ఏఎస్‌ఐలు ప్రసాద్, సురేష్, సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
పెద్దల జోక్యంతో బాధితులకు న్యాయం
గరివిడి పట్టణ పెద్దలతోపాటు వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు చెందిన ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బమ్మిడి అప్పలస్వామి, భీంపల్లి వెంకటరావు, సివుకు కాంతారావు, మీ సాల వరహాలనాయుడు, పైల బలరాం తదితరులు మృతుని కుటుంబానికి బాసటగా నిలి చారు.
ఇంటి యజమానులు ప్రసాద్, నర్సింహమూర్తులతో చర్చలు జరిపారు. ఇంటిని విక్రయించిన ప్రసాద్ ఇంకా ఖాళీ చేయనందున తనకు సంబంధం లేదని నర్సింహమూర్తి చెప్పా రు. ఇద్దరూ నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని పెద్ద లు స్పష్టం చేశారు. దీంతో మృతుని ముగ్గురు కుమార్తెల పేరిట రూ.6 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వా రు అంగీకరించారు. మృతుని పెద్ద కు మార్తె కావ్య డిగ్రీ, మిగిలిన ఇద్దరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ ఎస్.రాఘవు లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కురుపాం: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండలంలోని ఉదయపురానికి చెందిన కాంట్రాక్ట్ బేసిక్ లైన్‌మెన్ ఊయక మురళీకృష్ణ(24)విద్యుదాఘాతానికి గురై శనివారం మధ్యాహ్నం మృతి చెందా రు. వివరాలిలా ఉన్నాయి. రస్తాకుంటుబాయి సమీపంలో 33 కేవీ లైన్‌కు గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం, మొండెంఖల్ ఫీడర్లకు చెందిన లైన్‌మెన్లు మరమ్మతులు చే స్తున్నారు. మొండెంఖల్ ఫీడర్‌కు చెందిన మురళీకృష్ణ అధికారుల పర్యవేక్షణలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లను కలుపుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తిని కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికుల సహాయంతో విద్యుత్ సిబ్బంది ఆటోలో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించాడని డాక్టర్ రవికుమార్ చెప్పారు. కురుపాం హెచ్‌సీ పరసన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి ట్రాన్స్‌కో ఏడీఏ ఆర్.సతీష్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎల్‌సీ తీసుకున్నా జరిగిన ప్రమాదం
విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టిన సిబ్బంది కురుపాం, పి.లేవిడి సబ్‌స్టేషన్ల నుంచి లైన్ క్లియరెన్స్(ఎల్‌సీ) తీసుకున్నా విద్యుత్ సరఫరా జరగటంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యులెవరన్నది విచారణలో తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.
బాధ్యులపై చర్య తీసుకోండి: ఎమ్మెల్యే శ్రీవాణి
లైన్‌మెన్ మురళీకృష్ణ మృతికి బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని కురుపాం ఎ మ్మెల్యే పాముల పు ష్పశ్రీవాణి ట్రాన్స్‌కో ఏడీఏ ఆర్.సతీష్‌కుమార్‌కు చెప్పారు. ఘ టన గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ట్రా న్స్‌కో అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని మందలించారు.
ఇద్దరిని కాటేసిన విద్యుదాఘాతం
Published Sun, Jun 28 2015 3:09 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement