అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా జైలు సూపరింటెండెంట్ భీం శేఖర్, ఆయన భార్య రేఖ(35) ఇద్దరు పిల్లలతోపాటు కానిస్టేబుల్ పురుషోత్తం బళ్లారి వైపు కారులో వెళ్తున్నారు. వారి వాహనాన్ని డి.హీరేహళ్ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో రేఖ, పురుషోత్తం అక్కడికక్కడే చనిపోగా, భీంశేఖర్ ఆయన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.