ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | Two MLC's are sworn ness | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Published Tue, May 2 2017 7:27 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

Two MLC's are sworn ness

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన అంగర రామ్మోహన్‌రావు, చిక్కాల రామచంద్రరావు ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం వెలగపూడి అసెంబ్లీలోని బీఏసీ సమావేశ మందిరంలో మండలి చైర్మన్‌ చక్రపాణి వారితో ప్రమాణస్వీకారం చేయించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. వెనుకబడిన తరగతులకు చెందిన తనకు టీడీపీ రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందని అంగర రామ్మోహన్‌రావు (ప.గోదావరి జిల్లా) పేర్కొన్నారు. కాగా, తనను గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు టీడీపీకి రుణపడి ఉంటానని చిక్కాల రామచంద్రరావు (తూ.గోదావరి జిల్లా) తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement