
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటన షెడ్యూల్
సిరిపురం : కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 5వ తేదీన విశాఖ వస్తున్నారు. ఢిల్లీలో ఇండిగో విమానంలో బయల్దేరి 8 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నోవోటెల్‌కు చేరుకుంటారు. అల్పాహారం అనంతరం ఆనందపురం మండలం గంభీరంలో ఏర్పాటు చేయనున్న ఎన్‌సీఈఆర్టీ ప్రాంతీయ కేంద్రంతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
అక్కడ నుంచి నేరుగా పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యాశాఖాధికారుల రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరవుతారు. 2.30 నుంచి 3.30 వరకూ సీతమ్మధార నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆంధ్ర యూనివర్శిటీ ప్లాటినం జూబ్లీహాల్లో యూనివర్శిటీకి చెందిన విభాగాధిపతులు, అధ్యాపకులు, ఇతర అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.30కు సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు. సాయంత్రం 6.15 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.