సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యమబాట వీడబోమంటూ తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో పర్యటించేందుకు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఆనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని సమైక్య వాదుల్లో రెట్టించిన ఉత్సాహం కన్పిస్తోంది.
ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో 92వ రోజు బుధవారం కూడా జిల్లా అంతటా నిరసనలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్‌క్లాక్ సర్కిల్‌లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలి పారు.
ఎస్కేయూలో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ధర్మవరం, గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్మవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు పొట్టిశ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు.
గుంతకల్లులో డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. గుత్తిలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్‌లో దిగ్విజయ్‌సింగ్ ది ష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు కలసి ర్యాలీ చే శారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు.
పభు త్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్‌లో రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేతబట్టుకుని..అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అమరాపురంలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాయదుర్గంలో విద్యార్థులు, జే ఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నది వైఎస్సార్‌సీపీ మాత్రమేనని ఆయన అన్నారు.
సమైక్యమే లక్ష్యం
Published Thu, Oct 31 2013 2:56 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement