tower clock circle
-
సమైక్యమే లక్ష్యం
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యమబాట వీడబోమంటూ తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో పర్యటించేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు ఆనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని సమైక్య వాదుల్లో రెట్టించిన ఉత్సాహం కన్పిస్తోంది. ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో 92వ రోజు బుధవారం కూడా జిల్లా అంతటా నిరసనలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్‌క్లాక్ సర్కిల్లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలి పారు. ఎస్కేయూలో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ధర్మవరం, గుంతకల్లులో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్మవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ విద్యార్థి జేఏసీ నాయకులు పొట్టిశ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. గుంతకల్లులో డిగ్రీ కళాశాల విద్యార్థులు ‘ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. గుత్తిలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో దిగ్విజయ్‌సింగ్ ది ష్టిబొమ్మను దహనం చేశారు. కదిరిలో ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు కలసి ర్యాలీ చే శారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. పభు త్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేతబట్టుకుని..అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అమరాపురంలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాయదుర్గంలో విద్యార్థులు, జే ఏసీ నాయకులు ర్యాలీ చేశారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు కట్టుబడి ఉన్నది వైఎస్సార్సీపీ మాత్రమేనని ఆయన అన్నారు. -
నిర్విరామ పోరు
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయాన్ని పాలకులు వెనక్కు తీసుకునే వరకు ఉద్యమ పథం నుంచి వైదొలగబోమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చాటుతున్నారు. జిల్లాలో ప్రతి ఊరూ వాడ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. మంగళవారం అనంతపురం నగరంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థులు, ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి.. మానవహారం నిర్మించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కొనసాగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక కోస్తామని హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వారు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాస్క్ధారికి నాలుక కోస్తున్నట్లు ప్రదర్శన చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. నంబులపూలకుంట, మడకశిరలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం చేపట్టారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విరామ సమయం లో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేశారు. కణేకల్లులో నాలుగవ తరగతి విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. తాడిపత్రిలో నాయీబ్రాహ్మణ సంఘం, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. -
అదే దూకుడు
సాక్షి, అనంతపురం : ప్రతి ఊరూ పోరుగడ్డ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పోరాటవీరులు అవుతున్నారు. వారందరిలోనూ చెక్కుచెదరని సమైక్య సంకల్పం కన్పిస్తోంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 62 రోజులుగా సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. సమ్మెలు, బంద్ లు, దీక్షలు, ర్యాలీలు, మానవహారాలతో పాటు వినూత్న నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్ సర్కిల్లో జాక్టో నాయకులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టి... స్థానిక సప్తగిరి సర్కిల్లో మానవహారం నిర్మించారు. కేసీఆర్, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్కెటింగ్ సిబ్బంది వంటా వార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు (ఆర్డీడీ) కే.రాజశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నోడల్ స్కూల్ సిబ్బంది ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేశారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి... 205 జాతీయ రహదారిపై వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ధర్మవరంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రోడ్డుపై బట్టలు కుట్టి, గుంతకల్లులో మునిసిపల్ కార్యాలయం ఎదుట సిబ్బంది నడి రోడ్డుపై వరినాట్లు వేసి, పామిడిలో జాక్టో నేతలు బజ్జీలు వేస్తూ.. రోడ్డుపై వెళ్లేవారికి మెహందీ పెడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ఇటుకలు మోసి నిరసన తెలిపారు. స్థానిక సద్భావన సర్కిల్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. చిలమత్తూరులో జెడ్పీ పాఠశాల సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో తనకల్లు మండల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేశారు. మడకశిరలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, రాస్తారోకో చేశారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. పుట్టపర్తిలో ‘సమైక్య సమర భేరి’ విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు పాల్గొని సమైక్య నినాదాలు మార్మోగించారు. గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెనుకొండలో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. రొద్దంలో టీ విక్రయిస్తూ నిరసన తెలిపారు. గోరంట్లలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలో ఆల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తెలుగుతల్లి వేషధారణలో హైలెట్‌గా నిలిచారు. పట్టణంలోని వినాయక సర్కిల్లో 600 మంది సమైక్యవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఉధృతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కణేకల్లులో జేఏసీ నాయకులు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. డీ.హీరేహాళ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. శింగనమలలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు. నార్పలలో సమైక్యవాదులు రోడ్డుపై ఆట పాటలతో నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై నడిచారు. సమైక్యాంధ్ర అనే అంశంపై వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు పాటల పోటీలు నిర్వహించారు. జేఏసీ నాయకులు రోడ్డుపై బఠానీలు, బిస్కెట్లు అమ్ముతూ నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధి హామీ మేట్లు, ఉరవకొండలో ఆర్టీసీ జేఏసీ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కూడేరులో వైద్య సిబ్బంది, బెళుగుప్పలో జేఏసీ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. -
అనంత గర్జన
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కదం తొక్కడంతో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురంలోని టవర్‌క్లాక్ సర్కిల్లో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట నిర్వహించిన ‘అనంత జనగర్జన’ విజయవంతమైంది. సమైక్య నినాదం ఢిల్లీకి వినిపించేలా ఉద్యమకారులు మిలియన్ నినాదాలతో సింహగర్జన చేశారు. ముందుగా శాంతికపోతాలు ఎగురవేసి, ‘మా తెలుగుతల్లికి మల్లెపూ దండ’ గీతాన్ని ఆలపించారు. తెలుగుజాతిని ఉద్దేశించి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సంయుక్త జేఏసీ చైర్మన్, డీఆర్వో హేమసాగర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. మరీముఖ్యంగా వెనుకబడిన ‘అనంత’ మరుభూమిగా మారడం ఖాయమన్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నుంచి సీమాంధ్రకు చుక్కనీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. దీనివల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందని వివరించారు. దీనికితోడు నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతాయన్నారు. శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తుతుందని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం అప్రజాస్వామికమని, విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ‘అనంత’ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పొరపాటును గ్రహించి సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. లేదంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ప్రాణమున్నంత వరకు విభజన నిర్ణయాన్ని ప్రతిఘటిస్తామని ఉద్యమకారులతో ప్రతిజ్ఞ చేయించారు. హోరెత్తుతున్న దీక్షలు, నిరసనలు జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం హోరెత్తుతూనే ఉంది. అనంతపురం నగరంలో జాక్టో, పీఆర్ జేఏసీ, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, హంద్రీనీవా, మైనర్ ఇరిగేషన్, ఆర్అండ్బీ, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా మాస్కు ధరించి విభజన భూతం పట్టినట్లు సమైక్యవాదులు వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో భారీ మానవహారం నిర్మించారు. చిలమత్తూరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగ జేఏసీ నేతలు, వైద్య సిబ్బంది రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. మడకశిరలో ఎల్ఐసీ సిబ్బంది, పట్టుపరిశ్రమ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. చిన్నారులు వివిధ వేషధారణలతో ప్రదర్శన చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు రహదారులను దిగ్బంధించారు. కొత్తచెరువులో పశువైద్యసిబ్బంది నిరసన తెలిపారు. పుట్టపర్తిలో వైద్య సిబ్బంది రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు అరగుండుతో నిరసన తెలిపారు. పెనుకొండలో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై నిలబడి, ఆర్డీఓ కార్యాలయంలోకి గొర్రెలు తోలి.. ఇలా విభిన్న పద్ధతుల్లో నిరసనలు తెలిపారు. సోమందేపల్లిలో విద్యార్థులు, పరిగిలో నాయీబ్రాహ్మణులు ర్యాలీ చేశారు. రొద్దంలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగించారు. గోరంట్లలో గాండ్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగాయి. రాయదుర్గంలో కురుబలు ర్యాలీ చేశారు. జేఏసీ, ఇతర ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు వంటా వార్పు చేపట్టారు. కణేకల్లులో వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విరమింపజేశారు. ఇదే పట్టణంలో ఎన్జీవోలు ముగ్గులపోటీ నిర్వహించారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. తాడిపత్రిలో మునిసిపల్, జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. యాడికి మండలంలో గీతకార్మికులు, పెద్దవడుగూరులో రెడ్డి సంఘం, బెళుగుప్పలో కురుబ సంఘం, కూడేరులో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఉరవకొండలో లయున్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30 గంటల దీక్షలు ప్రారంభమయ్యాయి. గుంతకల్లులో ప్రభుత్వ జేఏసీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కదిరిలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తలుపులలో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. -
విశ్వరూపం
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఊరూ ఉద్యమ పథంలో సాగుతోంది. ప్రతి వాడలోనూ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. 32వ రోజైన శనివారం కూడా జిల్లాలో ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో పత్రికా రవాణా వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడే వంటా వార్పు చేపట్టారు. రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలకు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు హేమసాగర్, కార్యదర్శి తిమ్మప్ప తదితరులు సంఘీభావం తెలిపారు. ఇదే శిబిరంలో కవులు, అటవీశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ డ్రైవర్లు రిలే దీక్షలు చేపట్టారు. టవర్‌క్లాక్ సర్కిల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోగటం విజయభాస్కర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజూ కొనసాగింది. మెడికల్ జేఏసీ నాయకుల దీక్షలకు ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు సంఘీభావం తెలిపారు. జేఎన్టీయూలో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు పదకొండో రోజూ కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు, న్యాయవాదులు, ముస్లిం యువకులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీచర్లు చెవిలో పూలు పెట్టుకుని ‘సోనియమ్మా... నీ భరతం పడతాం’ అంటూ భజన చేసుకుంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రులు ఎక్కడ దాక్కున్నారంటూ పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు డాగ్‌స్క్వాడ్, టార్చిలైట్లతో వెతికి, నిరసన తెలిపారు. ఎస్కేయూలో విద్యార్థుల రిలే దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు ధర్మవరం పట్టణానికి చెందిన న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఎస్కేయూ మహిళా ఉద్యోగులు జాతీయ రహదారిపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. బత్తలపల్లిలో జేఏసీ, ముదిగుబ్బలో టీచర్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ముదిగుబ్బలో పాత్రికేయులు రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లులో విద్యుత్ ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించి, రోడ్డుపై ప్రార్థన చేశారు. హిందూపురంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో చిన్నారులు, విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేశారు. మంత్రులు, ఎంపీలకు పదవులే ముఖ్యమని విమర్శిస్తూ ఉపాధ్యాయులు కుర్చీలతో ప్రదర్శన చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి, ఎన్జీఓలు ,విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. చిలమత్తూరులో పంచాయతీ కార్మికులు రిలేదీక్షలు చేపట్టారు. లేపాక్షిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. తలుపులలో ఉపాధ్యాయులు రోడ్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఎన్పీకుంటలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ప్రద ర్శన నిర్వహించారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, పుట్లూరులో జేఏసీ నాయకులు, మడకశిరలో వైద్య,ఆరోగ్యశాఖ ఉద్యోగులు, పెనుకొండలో చేనేతలు, గోరంట్లలో ట్రాన్స్‌కో ఉద్యోగులు, గార్లదిన్నెలో రిక్షావాలాలు, నార్పలలో సమైక్యవాదులు ర్యాలీలు నిర్వహించారు. అమరాపురంలో తోపుడుబండ్ల వ్యాపారులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు చెవిలో పూలుపెట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుక్కపట్నంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. ఓడీచెరువులో ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అమడగూరులో రిలే దీక్షలు చేపట్టారు. రాయదుర్గంలో జాక్టో ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు దొంగ రాజీనామాలు చేశారంటూ చెవిలో పూలుపెట్టుకుని నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, విద్యార్థి జేఏసీ, అరబిక్ కళాశాల, ప్రైవేటు బస్సుల కండక్టర్లు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఎన్జీఓలు గంజి పంపిణీ చేసి నిరసన తెలిపారు. 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన డిగ్రీ విద్యార్థి రాజేష్‌కు మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఆత్మకూరులో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. సీకేపల్లెలో మాదిగలు దండోరా కార్యక్రమం నిర్వహించారు. శింగనమలలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రి మునిసిపల్ కార్యాలయం ఎదుట జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపప్పూరులోని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఉరవకొండలో సమైక్యవాదులు ప్రదర్శనలతో హోరెత్తించారు.