కాకతీయ దిగువ కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. గరిష్టంగా 8 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కాకతీయ కాలువలను డిజైన్ చేసినా ప్రస్తుతం 3 వేలకు మించి నీటినందించలేని పరిస్థితి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : కాలువ లైనింగ్ దెబ్బతిన్న చోట ఇసుక సంచులుంచి నీటిని విడుదల చేస్తున్న అధికారులకు యూటీలు పరీక్ష పెడుతున్నాయి. ఎల్‌ఎండీ దిగువన ఉన్న నాలుగు యూటీలు లీకేజీ అవుతున్నాయి. గతంలో కాలువ 149వ కిలోమీటర్ వద్ద మరమ్మతు చేసిన యూటీకి మళ్లీ లీకేజీ ఏర్పడింది. నీరు విడుదల చేస్తే ఆ తాకిడికి లీకేజీలు మరింత పెద్దవిగా మారే ప్రమాదముంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరున్నా కాలువ పరిస్థితి బాగా లేనందున మూడు వేల క్యూసెక్కులు వదిలితే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
రబీలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని, 3 వేల క్యూసెక్కులే వదిలితే చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా లేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తేనే మేలని పేర్కొంటున్నారు. 149వ కిలోమీటర్ యూటీ మరమ్మతు సమయంలో వేసిన ఇసుక బస్తాలు కాలువలోనే దర్శనిమివ్వడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. అక్కడ లైనింగ్ సైతం చేయలేదని రైతులు పేర్కొంటున్నారు. యూటీల లీకేజీలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి పెద్దవిగా మారి బుంగ పడితే రైతులే బాధ్యులంటూ కేసులు నమోదు చేస్తున్నారని సమీప చేల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెలాఖరులోగా నీటి విడుదల చేసే అవకాశముండగా... అంతకుముందే అధికారులు ఒకసారి కాలువలను, యూటీలను పరిశీలించి మరమ్మతు చేయిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు కోరుతున్నారు.
రబీ తర్వాతే మరమ్మతు
ఎల్‌ఎండీ దిగువన కాకతీయ కాలువల లైనింగ్, యూటీల లీకేజీ కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎస్సారెస్పీ సీఈ శంకర్ తెలి పారు. మరమ్మతుకు 45 రోజుల సమయం అవసరమని.. రబీలో సాగుకు, స్టేజ్ 2కి తాగునీటికి ఏప్రిల్ ఆఖరు వరకు నీటిని విడుదల చేసిన తర్వాత పనులు తిరిగి ప్రారంభిస్తామని చెప్పా రు. కాలువల మొదట ఉన్న రైతులు నీటిని వృథా చేయకుండా కింద రైతులకు పంపిస్తే ఇబ్బంది ఉండదని సూచించారు.
యూటీలు అధ్వానం..
Published Fri, Dec 20 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement