రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అప్రజాస్వామిక బిల్లును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. ఏపీ ఎన్జీఓల సీమాంద్ర బంద్ పిలుపునకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిచ్చింది. పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనల్లో పాల్పంచుకున్నారు. విద్య, వాణిజ్య సంస్థలతో పాటు
బ్యాంకులు, పెట్రోల్ బంకులు, హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కర్నూలులో ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు.
మధ్యాహ్నం ఆటోలు కూడా తిరగకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. అన్ని రాజకీయ, ప్రజా, విద్యార్థి, కార్మిక, కర్షక, యువజన సంఘాలు తమ వంతు పాత్ర పోషించాయి. చట్టసభల సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోక నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ముక్త కంఠంతో నిరసించారు. బిల్లును జాతీయ సమస్యగా అన్ని
పార్టీలు పార్లమెంటులో అడ్డుకోవాలని కోరారు.
సమైక్యాగ్రహం
Published Fri, Feb 14 2014 3:39 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement