Splitting the bill
-
ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గం
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీ ప్రకటించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయం సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పార్లమెంట్ ప్రకటించారు.. గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో కూడా రాష్ట్రానికి పదేళ్ల పాటు హోదా ఇస్తామని పేర్కొంది. అంతే కాకుండా.. మోదీ, వెంకయ్యనాయుడు ఎన్నికల సభలోనూ హామీ ఇచ్చారు అని రామకృష్ట గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు అనగుణంగా హోదా ఇవ్వాల్సింది పోయి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని మాట్లాడడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టడమేనని విమర్శించారు. కేంద్రం ప్యాకేజీ ఇచ్చినా సరిపెట్టుకుందామనే చంద్రబాబు నాయుడు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు జరిగే ఉద్యమంలో ప్రజలతో పాటు పాలకులు కూడా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, విభజన బిల్లులో హామీల అమలు డిమాండ్‌తో నవంబరు రెండున విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ సమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని అన్నారు. -
ఆ బిల్లుకు ఆమోదం తెలపకండి
గవర్నర్‌తో సమావేశమైన మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) విభజన బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కోరారు. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తే ఇక బీబీఎంపీ విభజన ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ శుక్రవారమిక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాతో సమావేశమయ్యారు. బీబీఎంపీ విభజన బిల్లు ఇప్పటికే గవర్నర్‌కు చేరిన నేపథ్యంలో ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం తెలపవద్దని దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ వాలాను కోరారు. సమావేశం అనంతరం దేవేగౌడ విలేకరులతో మాట్లాడుతూ...‘బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేసేస్తే ఇక బీబీఎంపీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, బీబీఎంపీ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇది రాజ్యాంగంలోని 74వ సెక్షన్‌కు విరుద్ధం. ఇదే విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ వజుభాయ్ వాలా చాలా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక ఇదే సందర్భంలో లోకాయుక్త(సవరణ) బిల్లు పై సైతం గవర్నర్‌తో చర్చించాను’ అని వెల్లడించారు. -
విభజన బిల్లులో లొసుగులు సరిచేస్తాం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్.. మునిగే పడవని ఎద్దేవా ప్రధాని మోదీ సారథ్యంలో దేశం పురోగమిస్తోందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో లొసుగులున్నాయని, వాటిని సరేచేసే క్రమంలో కాంగ్రెస్ మిత్రుల తో మాట్లాడుతున్నామని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో మార్పు లా లేక రాజ్యాంగ సవరణా అనేది గమనించి పొరపాట్లు సరిదిద్దుతామన్నారు. అప్పుడే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా వంటివి వీలవుతాయన్నారు. విశేషానుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే పడవతో పోల్చారు. పార్లమెంట్లో తాము చె ప్పేదే వినాలని పట్టుబట్టడం తప్ప ప్రజాసమస్యలపై చర్చకు ఆ పార్టీ అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆగ్రాలో మత మార్పిడిపై సభ్యులు గందరగోళం సృష్టిస్తే కాంగ్రెస్ మిత్రపక్షమైన సమాజ్‌వాదీ అధినేత ములాయం యూపీలో ఎలాంటి అలజడీ లేని అంశంపై ఎందుకు హడావుడి చేస్తారంటూ ప్రశ్నించారని తెలిపారు. మతమార్పిడిపై చర్చ చేపడితే తొలుత ఇరుక్కునేది కాంగ్రెస్ పార్టీయేనన్న సంగతి మర్చిపోతే ఎలాగన్నారు. గ్యాస్ సిలిండర్ల సంఖ్యను పునరుద్ధరించామన్నారు. నల్లధనం, గ్రామీణ ఉపాధి హామీ, హుద్‌హుద్ తుపాను, ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అనేక అంశాలపై చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అన్ని దేశాలతోనూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్నామని, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కోరుకున్నా ఆ దేశం బుద్ధి మార్చుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని చొరవతో మన ‘యోగా’ ప్రతి ఏటా జూన్ నెల 21న అంతర్జాతీయ దినోత్సవంగా మారడం, భారత్‌కు చెందిన వ్యక్తి బ్రిక్స్ బ్యాంకుకు అధ్యక్షుడు కావడం వంటివి జరుగుతున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమ తా బెనర్జీ సవాల్‌పై స్పందిస్తూ.. రూ.2 లక్షల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసును యూపీఏ హయాంలోనే సీబీఐ చేపట్టిందని, దీన్ని సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తుం డగా బీజేపీ సీబీఐని ఉసిగొల్పుతోందనడం అవివేక ఆరోపణలుగా కొట్టిపారేశారు. సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంఎల్ఏలు పాల్గొన్నారు. -
టీజీ, ఏరాసు దారెటు....?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల భవిష్యత్తు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర విభజన బిల్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకే భాష.. ఒకే రాష్ట్రంగా కలసిమెలసి జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ సాహసించని పరిస్థితి నెలకొంది. చాలా మంది పార్టీ నుంచి జారుకునేందుకు సరైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం తెలిసిందే. ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపగా.. నాయకత్వ లోపం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలు కనీస పోటీని ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృతమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తుండగా.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్‌లు తమ భవిష్యత్‌పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఉద్యమానికి కనీస మద్దతివ్వని వీరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య ద్రోహుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మొదటి నుంచి కలిసి నడుస్తున్న టీడీపీతో దోస్తీ చేసేందుకు వీరు పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. అధికార పార్టీ తీరుతో తాము కాంగ్రెస్ నాయకులమని చెప్పుకునేందుకు కూడా సిగ్గేస్తోందని వీరు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం అందుకు బలం చేకూరుస్తోంది. టీజీ కర్నూలు నుంచి, ఏరాసు పాణ్యం నుంచి పోటీ చేసే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికకు ముహూర్తం సిద్ధం చేసుకున్నా.. పార్లమెంట్లో విభజన బిల్లు ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని వీరు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు సమాచారం. విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారో లేదోననే సందిగ్ధం వారిని వెంటాడుతోంది. బీజేపీతో జతకడితే... టీడీపీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతం ఆ పార్టీలో చేరాలనుకునే నాయకులను సంశయంలోకి నెట్టుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. టీడీపీ తరఫున పోటీ చేసినా బీజేపీ ప్రభావంతో ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందేమోననే టీజీ, ఏరాసులు ఆలోచిస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కర్నూలు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకమైన తరుణంలో టీడీపీ తరఫున బరిలో నిలిచినా బీజేపీతో ఆ పార్టీ దోస్తీ మొదటికే మోసం తీసుకొస్తుందేమోనని వీరు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఇక టీడీపీని కాదనుకుంటే.. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడితే అటువైపు అడుగులేద్దామనే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. -
సమైక్యాగ్రహం
రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అప్రజాస్వామిక బిల్లును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. ఏపీ ఎన్జీఓల సీమాంద్ర బంద్ పిలుపునకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిచ్చింది. పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనల్లో పాల్పంచుకున్నారు. విద్య, వాణిజ్య సంస్థలతో పాటు బ్యాంకులు, పెట్రోల్ బంకులు, హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కర్నూలులో ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఆటోలు కూడా తిరగకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. అన్ని రాజకీయ, ప్రజా, విద్యార్థి, కార్మిక, కర్షక, యువజన సంఘాలు తమ వంతు పాత్ర పోషించాయి. చట్టసభల సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోక నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ముక్త కంఠంతో నిరసించారు. బిల్లును జాతీయ సమస్యగా అన్ని పార్టీలు పార్లమెంటులో అడ్డుకోవాలని కోరారు. -
దుర్దినం
ఏదైతే కాకూడదనుకున్నామో అదే అయ్యింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రెప్పపాటులో రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పెద్దలు ఘనంగా చాటుకున్నారు. ఎన్నడూ.. ఎక్కడా చట్టసభలో ఇలా బిల్లు ప్రవేశపెట్టలేదు. కనీవినీ ఎరుగని రీతిలో గురువారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సమైక్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. టీడీపీ, కాంగ్రెస్ నేతల దొంగాట నడుమ సీమాంధ్రకు ద్రోహం జరిగిపోయింది. చేయాల్సిందంతా చేసి.. అన్ని పనులు పూర్తి చేసుకుని.. తుదకు రాజ్యసభ ఎన్నికలు కూడా కోరుకున్నట్లు జరిపించుకుని ఏమీ తెలియనట్లు నటిస్తున్న కపట నాటక సూత్రధారులైన కాంగ్రెస్ నేతలపై జనం రగిలిపోతున్నారు. వారి నాటకాన్ని ముందుండి నడిపించిన టీడీపీ నేతల రాజకీయ జీవితానికి చరమగీతం పాడతామంటున్నారు. -
నేడు జిల్లా బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపు
పార్లమెంట్లో గురువారం విభజనబిల్లును ప్రవేశపెట్టడానికి నిరసనగా వైఎస్సార్సీపీ శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు సహకరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. -
పంజా
పంజగుట్టే టార్గెట్..చోరులకది అడ్డా ఇక్కడ ఇలాంటి సంచలనాలెన్నో ముఖ్య కూడలి..అయినా భద్రత కరువు సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట, న్యూస్‌లైన్: పంజగుట్ట.. నగరం నడిబొడ్డునున్న ఈ ప్రాంతం ముఖ్య కూడలి.. అనేక వ్యాపార, వాణిజ్యాల కేంద్రం.. కూతవేటు దూరంలో సీఎం క్యాంపు కార్యాలయం.. సహజంగానే పోలీస్ భద్రత, బందోబస్తు ఎక్కువగానే ఉంటుందని అంతా భావిస్తారు. కానీ దొంగల తొలి టార్గెట్ ఈ ప్రాంతమే. ఇక్కడ దొంగలు తరచూ పంజా విసురుతున్నారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక దోపిడీలు, బందిపోటు దొంగతనాలు జరిగినా.. వీటిలో కొన్ని తీవ్ర సంచలనం సృష్టించినా సిటీ చరిత్రలో తనిష్క్‌దే అత్యంత భారీ చోరీగా రికార్డులకెక్కింది. పంజగుట్ట ప్రాంతంలో దాదాపు 20కి పైగా ప్రముఖ నగల, వాచ్ షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో అనేకం సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం, విభజన బిల్లుపై చర్చ, నగరంలోని పరిణామాల నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా అక్కడికి కూతవేటు దూరంలోనే ఈ భారీ చోరీ జరిగింది. ఈ ప్రాంతంలో దృష్టి మళ్లించి చేసే నేరాలు, పార్క్ చేసిన కార్ల అద్దాలు పగులగొట్టి సొత్తు అపహరించుకుపోవడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఇక్కడ తనిష్క్ జ్యువెలర్స్‌లో జరిగిన భారీచోరీ సంచలనం కలిగించింది. ‘వారం వారం’ పంజగుట్టలో... ఆదివారం (2013, సెప్టెంబర్ 8): సీఎమ్ఆర్ షాపింగ్ మాల్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెండి వస్తువులు కొన్నారు. అదను చూసి 28 తులాల బంగారం ఎత్తుకుపోయారు. సోమవారం (2013, ఫిబ్రవరి 11): మోర్ జ్యువెలర్స్‌లో గుజరాత్‌కు చెందిన ఇద్దరు రూ.25 లక్షల విలువైన రెండు వజ్రాల నెక్లెస్‌లు తస్కరించారు. మంగళవారం (2006, మే 16): జాయ్ అలుక్కాస్‌లో ఐదుగురు దొంగలు పడి రూ.10 కోట్ల విలువైన ఆభరణాలు, వజ్రాలు ఎత్తుకుపోయారు. బుధవారం (2009, మార్చి 18): తాజ్ డెక్కన్‌లోని బియాడ్ లగ్జరీ వాచ్ షాపు నుంచి రూ.54 లక్షల విలువైన వాచీలు తస్కరణకు గురయ్యాయి. గురువారం (2012, జనవరి 26): కల్యాణ్ జ్యువెలర్స్‌కు పాత ఆభరణాలు మార్చి కొత్తవి కొనడానికి వచ్చిన ఎన్ఆర్ఐ జంట నుంచి రూ.3 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. శుక్రవారం (2013, మార్చి 23): నాగార్జున సర్కిల్ సమీపంలో ఉన్న కమల్ వాచ్ కంపెనీలో రూ.1.5 కోట్ల విలువైన వాచీలు ఎత్తుకుపోయారు. శనివారం (2014, జనవరి 25): తనిష్క్ జ్యు వెలర్స్‌లో రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు తన ‘పని’ పూర్తి చేసుకుపోయాడు. -
ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం
=ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం =టీ-బిల్లు చర్చకు మరోసారి ప్రత్యేక సమావేశాలు సీమాంధ్ర మంత్రులతో భేటీలో కిరణ్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు నిర్ణయించారు. ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు చివరి తేదీ వరకూ సమయాన్ని వినియోగించుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతిని అదనంగా మరో 20 రోజుల సమయం కోరాలని కూడా వారు భావించారు. సోమవారం అసెంబ్లీకి హాజరుకాని సీఎం కిరణ్ సాయంత్రం సీమాంధ్ర మంత్రులతో తన నివాసంలో సమావేశమయ్యారు. అనారోగ్యం కారణంగా సోమవారం సభకు రాలేకపోయానని.. మంగళవారం సభకు వస్తానని.. బిల్లుపై చర్చను ఎప్పటి నుంచి చేపట్టాలో అప్పుడు నిర్ణయిస్తానని మంత్రులతో సీఎం చెప్పారు. ప్రస్తుత సమావేశాలకు సంబంధించిన ఎజెండాను బీఏసీలో ఖరారు చేసినందున వాటిపైనే ఇప్పుడు చర్చ సాగుతుందని, విభజన బిల్లు వచ్చినట్లు సభలో ప్రకటించినందున చర్చ ఎప్పుడైనా చేపట్టవచ్చని, రాష్ట్రపతే గడువు ఇచ్చినందున ఇప్పటికిప్పుడే దాన్ని తిప్పి పంపాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ప్రతి అంశంపై చర్చకు సభ్యుడికి గంటకు పైగా సమయం పడుతుందని, ఈ లెక్కన జనవరి 23వరకు సభ నడవాల్సిందేనని సీఎం వివరించినట్టు మంత్రులు తెలిపారు. ఆర్టికల్ - 371డీపై రాజ్యాంగ సవరణ జరగకుండా విభజన చేయడానికి వీల్లేదని పునరుద్ఘాటించినట్లు సమాచారం. ముసాయిదా బిల్లు చర్చ ప్రారంభంపై తెలంగాణ మంత్రులు హడావుడి చేయడంపై సీమాంధ్ర మంత్రులు తప్పుబట్టారు. బిల్లుపై లోతుగా చర్చిస్తామని, ఎన్నిరోజులైనా చర్చలో పాల్గొంటామని మంత్రి ప్రతాప్‌రెడ్డి.. సీఎంతో సమావేశానంతరం విలేకరులకు తెలిపారు. సభలో విభజన బిల్లుపై సీమాంధ్ర నేతలంతా వ్యతిరేకంగా మాట్లాడతారని, తద్వారా తెలంగాణను అడ్డుకుంటామని మంత్రి టీజీ చెప్పారు.