విభజన బిల్లులో లొసుగులు సరిచేస్తాం
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
- కాంగ్రెస్.. మునిగే పడవని ఎద్దేవా
- ప్రధాని మోదీ సారథ్యంలో దేశం పురోగమిస్తోందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో లొసుగులున్నాయని, వాటిని సరేచేసే క్రమంలో కాంగ్రెస్ మిత్రుల తో మాట్లాడుతున్నామని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో మార్పు లా లేక రాజ్యాంగ సవరణా అనేది గమనించి పొరపాట్లు సరిదిద్దుతామన్నారు.
అప్పుడే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా వంటివి వీలవుతాయన్నారు. విశేషానుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే పడవతో పోల్చారు. పార్లమెంట్‌లో తాము చె ప్పేదే వినాలని పట్టుబట్టడం తప్ప ప్రజాసమస్యలపై చర్చకు ఆ పార్టీ అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆగ్రాలో మత మార్పిడిపై సభ్యులు గందరగోళం సృష్టిస్తే కాంగ్రెస్ మిత్రపక్షమైన సమాజ్‌వాదీ అధినేత ములాయం యూపీలో ఎలాంటి అలజడీ లేని అంశంపై ఎందుకు హడావుడి చేస్తారంటూ ప్రశ్నించారని తెలిపారు.
మతమార్పిడిపై చర్చ చేపడితే తొలుత ఇరుక్కునేది కాంగ్రెస్ పార్టీయేనన్న సంగతి మర్చిపోతే ఎలాగన్నారు. గ్యాస్ సిలిండర్ల సంఖ్యను పునరుద్ధరించామన్నారు. నల్లధనం, గ్రామీణ ఉపాధి హామీ, హుద్‌హుద్ తుపాను, ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అనేక అంశాలపై చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. అన్ని దేశాలతోనూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్నామని, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కోరుకున్నా ఆ దేశం బుద్ధి మార్చుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రధాని చొరవతో మన ‘యోగా’ ప్రతి ఏటా జూన్ నెల 21న అంతర్జాతీయ దినోత్సవంగా మారడం, భారత్‌కు చెందిన వ్యక్తి బ్రిక్స్ బ్యాంకుకు అధ్యక్షుడు కావడం వంటివి జరుగుతున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమ తా బెనర్జీ సవాల్‌పై స్పందిస్తూ.. రూ.2 లక్షల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసును యూపీఏ హయాంలోనే సీబీఐ చేపట్టిందని, దీన్ని సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తుం డగా బీజేపీ సీబీఐని ఉసిగొల్పుతోందనడం అవివేక ఆరోపణలుగా కొట్టిపారేశారు. సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంఎల్‌ఏలు పాల్గొన్నారు.