చిత్తూరు: సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. వరదయ్యపాలెం బస్టాండ్‌లో ఆమరణ దీక్షలు 5వరోజు కొనసాగుతున్నాయి. జిల్లాలో 22 రోజులుగా ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. ఈ కారణంగా తిరుపతి ఆర్టీసి రీజియన్ 28 కోట్ల 30 లక్షల రూపాయల మేర ఆదాయం నష్టపోయింది. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఎస్వీయూలో విద్యార్థుల జాక్ దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి.
ఆర్డీఓ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల దీక్షలు ఆరో రోజుకు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్జీవోల దీక్ష 5వ రోజుకు, టీటీడీ కార్యాలయం వద్ద టీటీడీ ఉద్యోగుల దీక్షలు 17వ రోజుకు , న్యాయవాదుల దీక్షలు 4వ రోజుకు, కేబుల్ ఆపరేటర్ల దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. రుయా వద్ద వైద్యుల దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమరదీక్షకు సంఘీభావంగా తుడా సర్కిల్ వద్ద కార్యకర్తలు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరుకుంది.
టీటీడీ నిర్వహించే మన గుడి కార్యక్రమంపై సమ్మె ప్రభావం పడింది. ఉద్యోగులు సమ్మె కారణంగా టీటీడీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. శ్రీవారి సేవకులతో మనగుడి కార్యక్రమం నిర్వహించారు.
కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరాహార దీక్షలు చేస్తున్నారు. కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో వైఎస్‌ఆర్‌సీపీ కుప్పం బంద్‌కు పిలుపునిచ్చింది.
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు
Published Wed, Aug 21 2013 9:32 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement