రాయచోటి, న్యూస్‌లైన్: భవిష్యత్తు తరాల అవసరాలను గుర్తెరిగే ప్రజలంతా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర రాయచోటి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంల అందరి సమిష్టి కృషితోనే రాజధాని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, అయితే నేడు తెలంగాణ వాదులు హైదరాబాద్ తమదంటుండడం దారుణమన్నారు. విభజన జరిగితే పూర్తిగా నష్ట పోయేది రాయలసీమే అని చెప్పారు.
రాష్ట్రవిభజన విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి ఏమి తెలుసని ఎద్దేవా చేశారు. సుమారు రూ..105 కోట్లు వెచ్చించి ఏర్పాటుచేసిన శ్రీక్రిష్ణకమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతామంటూ ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. సమై క్యాంధ్ర జేఏసీ రాయచోటి కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విభజన ఉద్యమాన్ని సాకుగా తీసుకున్న కర్నాటక, మహారాష్ట్ర రాయలసీమ క్రిష్ణాబేసిన్‌లో లేదంటూ వాదిస్తుండటం వితండవాదమేనన్నారు.
టిడిపి నాయకుడు ప్రసాద్‌బాబు, ఎన్‌జీఓసంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ నేతలు శ్రీనివాసరాజు, విఆర్ రెడ్డి, జనార్దన్, ఆర్టీసీ కార్మిక నాయకులు రామమోహన్,యహియాబాష, జమియత్ ఉలేమా నాయకుడు అజ్మతుల్లా, ప్రైవేటుస్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజులు ప్రసంగించారు. జెఏసీ నేతలు మనోహర్‌రాజు, నాగేశం, సాంబశివ, ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్లు పి. మనోహర్‌రెడ్డి, రమణారెడ్డి, శివగంగిరెడ్డి, ఎస్‌డిహెచ్‌ఆర్ డిగ్రీకళాశాల కరస్పాండెంట్ హరినాధరెడ్డి, సర్పంచ్ రవిరాజు, టిడిపి నేత ఇర్షాద్‌అలీఖాన్, డ్వాక్రా మహిళలు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు.
భవిష్యత్ అవసరాల కోసమే ఉద్యమం
Published Sat, Aug 31 2013 5:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement