మానవాళి సమస్యలకు వర్సిటీలు పరిష్కారం చూపాలి | universities must show the answers for human problems | Sakshi
Sakshi News home page

మానవాళి సమస్యలకు వర్సిటీలు పరిష్కారం చూపాలి

Published Mon, Feb 6 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

మానవాళి సమస్యలకు వర్సిటీలు పరిష్కారం చూపాలి

మానవాళి సమస్యలకు వర్సిటీలు పరిష్కారం చూపాలి

- టిబెట్‌ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ స్టడీస్‌ మాజీ వీసీ
- ఎస్వీయూలో వీసీల సదస్సు ప్రారంభం.. 300 మంది వీసీల హాజరు


తిరుపతి: దేశంలోని విశ్వవిద్యాలయాలు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని టిబెట్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ టిబెటన్‌ స్టడీస్‌ మాజీ వీసీ ప్రొఫెసర్‌ సాంథోంగ్‌ రిన్‌పచీ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలో ఆదివారం అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ 91వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ‘స్వాతంత్య్రం అనంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై 3 రోజులు పాటు ఈ సదస్సు జరగనుంది. సదస్సును ప్రారం భించిన ప్రొఫెసర్‌ సాంథోంగ్‌ రిన్‌పచీ మాట్లా డుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటు న్న అనేక సవాళ్లు మానవాళికి ప్రమాదకరంగా మారాయన్నారు. మనుషుల మధ్య అంతరా లు పెరిగాయన్నారు.

ఊహించని యుద్ధాలు, తీవ్రవాదం ప్రపంచాన్ని శాసిస్తున్నాయని, వీటిని సైతం పలుదేశాలు వ్యాపార ధోరణితో స్వాగతిస్తున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. మతద్వేషాలు, మతోన్మాదాలు ప్రపంచాన్ని ఛిన్నాభి న్నం చేస్తున్నాయన్నారు.  భారతదేశ ఐక్యత, విలువలను పెంపొందించేం దుకు  విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐయూ అధ్య క్షుడు చహాన్‌ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధిలో వీసీ ల పాత్ర గణనీయమన్నారు. ఏఐయూ సెక్రటరీ జనరల్‌ మాట్లాడుతూ  వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుకోవా లని సూచించారు. కామన్‌వెల్త్‌ విశ్వవిద్యాల యాల అసోసియేట్‌ డిప్యూటీ సెక్రటరీ జాన్‌ కిర్క్‌ల్యాండ్, యూరో పియన్‌ యూనియన్‌ డిప్యూటీ మినిçస్టర్‌ సిసర్‌ ఓన్‌స్టినీ, ఎస్వీయూ వీసీ దామోదరం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు, ఎస్వీయూ రెక్టార్‌ భాస్క ర్, రిజిస్టార్‌ దేవరాజులు, పాలక మండలి సభ్యుడు గురు ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement