svuniversity
-
ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం
టీడీపీ ప్రభుత్వ ఆశీస్సులతో హైకోర్టు కన్నుగప్పి పాత తేదీలతో విధుల్లో చేరిన ఎస్వీ యూనివర్సిటీ వీసీ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. ఈయన నిమామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఈ నెల 24న తుది తీర్పు వెలువడనుంది. తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం ఖాయం కావడంతో రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ అంశంపై సోమవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసినట్లు తెలిసింది. సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 4న ఆయన విధుల్లో చేరా రు. ఆయనకు అనుకూలమైన అప్పటి ఎస్వీయూ అధికారుల సహకారంతో 3వ తేదీన విధుల్లో చేరిన ట్లు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి, హైకోర్టుకు చేరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్ నియామకాన్ని తప్పుపట్టింది. ఈ నియామకంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో ఈ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది. 24న తుది తీర్పు వెలువడనుంది. ఆయన తొలగింపు ఉత్తర్వులు లాంఛనమే. గత ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. ఈయన ఇదివరకు ఎలాంటి పదవులూ చేపట్టలేదు. విభాగాధిపతిగా కూడా పనిచేయలేదు. అకడమిక్ పరంగా కూడా చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేదు. వయసు రీత్యా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సోదరుడు కావడంతో ప్రభుత్వం ఈయన్ను వీసీగా నియమించింది. ఈయన వీసీ పోస్టుకు దరఖాస్తు చేయకపోయినా సెర్చ్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు దరఖాస్తు తెప్పించుకుని పదవి కట్టబెట్టారు. ఈ నియామకం వెనుక మాజీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. నియామక ప్రక్రియపై అనేక కేసులు ఎస్వీయూ వీసీ నియామకానికి గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి మొదటివారంలో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సెర్చ్ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి ఒక సభ్యుడిగా ఉండటం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి. మునిరత్నం రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చింది. ఎస్వీయూ, పద్మావతి, మరికొన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించ వద్దని ఆదేశించింది. ఫిబ్రవరి 4న ఈ తీర్పు వస్తుందని భావించిన ప్రభుత్వం ముందు రోజు అర్ధరాత్రి ఈయన్ను వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే వీసీల నియామకం చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ ఎస్వీయూ వీసీగా ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టినట్లు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. కో వారెంటో.. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్ నియామాన్ని సవాల్ చేస్తూ ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ మార్చిలో ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి హైకోర్టులో కో వారెంటో వేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. హైకోర్టుకు వేసవి సెలవుల అనంతరం సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు వీసీ నియామకంలో గత ప్రభుత్వం తప్పు చేసినట్లు గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టం కావడంతో ఎస్వీయూ వీసీ నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు హైకోర్టు గుర్తించడంతో వీసీని తొలగించే అవకాశాలున్నాయి. ఎస్వీయూ వీసీ రాజీనామా ? ఎస్వీయూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్న ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ నియామకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, పదవిపోవడం దాదాపు ఖరారు కావడంతో ఆయన రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. వారం తర్వాత హైకోర్టు తనను వీసీగా తొలగించే అవకాశం ఉండటంతో రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆయన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిశారు. ఎస్వీయూ వీసీ పదవికి రాజీనామా చేసినట్లు ఎస్వీయూలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వీసీతో మాట్లాడేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించింది. ఆయన స్పందించలేదు. -
ఘనంగా ఎస్వీయూ స్నాతకోత్సవం
యూనివర్సిటీ క్యాంపస్ : మూడేళ్ల తర్వాత నిర్వహించిన ఎస్యీయూ స్నాతకోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. స్నాతకోత్సవానికి ఇస్రో చైర్మన్ శివన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ జానకి రామయ్య, రిజిస్ట్రార్ అనురాధ, పాలక మండలి సభ్యులు, ఫ్యాకల్టీ డీన్ల సమక్షంలో ఈ స్నాతకోత్సవం వేడుకగా సాగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హజరు కాకపోవడంతో ఎస్వీయూ వీసీ దామోదరం చాన్సలర్ హోదాలో ఇస్రో చైర్మన్ కే.శివన్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. అనంతరం పీహెచ్డీ, ఎంఫిల్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ తదితర డిగ్రీలను ప్రదానం చేశారు. తరువాత వివిధ సబ్జెక్ట్‌లలో టాపర్లుగా నిలిచిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఇస్రో చైర్మన్ స్నాతకోపన్యాసంతో ఈ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే డిగ్రీలు పొందిన విద్యార్థులు అనందంతో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఎస్వీయూతో ఇస్రోకు ఎంతో అనుబంధం ఉందని ఇస్రో చైర్మన్ కే.శివన్ అన్నారు. ఎస్వీయూ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన స్నాతకోపన్యాసం చేశారు. ఎస్వీయూ ఎంతో పురోగతి సాధించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎస్వీయూ విశిష్టస్థానం దక్కించుకుందన్నారు. ఎస్వీయూ గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిందన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన విద్యార్థుల కళ్లలో కాంతులు కనిపిస్తున్నాయన్నారు. డిగ్రీలు పొందిన వారు ఉన్నత లక్ష్యాలను చేరుకుని యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడంతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. నూతన ఆలోచనలు, సృజన్మాతకత కలిగిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధికి, వ్యక్తిగత, కుటుంబ అభివృద్ధికి అవసరమైన వేయి మార్గాలు విద్యార్థుల ఎదుట ఉన్నాయన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకత, నూతన ఆలోచన ధోరణి విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు. దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, నీటి కొరత, నిరుద్యోగం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి దిశగా ఎస్వీయూ ఎస్వీయూనివర్సిటీ మూడేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దామోదరం చెప్పారు. ఎస్వీయూ నాక్‌లో ఏ ప్లస్ గ్రేడ్‌తో పాటు యూజీసీ కేటగిరి–1 అటానమస్ హోదా పొందిందన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఎస్వీయూ మంచి ర్యాంకులు సాధించిందన్నారు. వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తీసుకొచ్చామన్నారు. కొత్త కోర్సులు, నూతన పరిశోధనలతో వర్సిటీని ముందుకు తీసుకెళున్నామన్నారు. 1,128 మందికి డిగ్రీలు ఎస్వీయూలో శనివారం నిర్వహించిన 55వ స్నాతకోత్సవం సందర్భంగా 1,128 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. డిగ్రీలు పొందిన వారిలో 151 మంది పీహెచ్డీ, 1 ఎంఫిల్, 976 మంది పీజీ డిగ్రీలు పొందారు. వీరు కాకుండా ఇన్ అడ్వాన్స్ రూపంలో 21,094 మంది, ఇన్ ఆబ్సెన్సియా రూపంలో 4,109 మంది డిగ్రీలు పొందారు. 65 మందికి బంగారు పతకాలు స్నాతకోత్సవంలో 65 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. పసిడి పతకాలు పొందిన వారిలో పూర్ణ చంద్రిక, ముకుందవల్లి, సునీత (గణితం), భాస్కర్, యామిని(రసాయన శాస్త్రం), లీలాకుమారి(బయోటెక్నాలజీ), సాయి వైష్ణవి(బాటనీ), శ్వేత, హేమలత(కంప్యూటర్ సైన్స్), చరణ్‌కుమార్ రెడ్డి(జాగ్రఫీ), వైష్ణవి, భారతి(హోంసైన్స్), నాగేంద్ర, సరిత, రాము, గురవమ్మ, (ఫిజిక్స్), రెడ్డమ్మ(సైకాలజీ), స్వప్న (స్టాటిస్టిక్స్), భార్గవి(జువాలజీ), మోహన్ కృష్ణ( ఎకనామిక్స్), అశోక పుత్ర(ఇంగ్లిషు), సుధాకర్(హిందీ), శివకేశవర్ధన్(ఫిలాసపీ), చిన్ని(పబ్లిక్ అడ్మినిస్ట్రేçషన్), సురేఖ(పొలిటికల్ సైన్స్), వీరమణి(సంస్కృతం),సురేష్(సోషియాలజీ), వెంకటేశు, సురేఖ(తెలుగు), వడివేలు(తమిళం), గుణశేఖర్, మైర్టేల్(కామర్స్), సౌజన్య(లా), రామరెడ్డి(బీఎల్ఐసీ), జెస్సీ ప్రశాంతి (సోషియాలజీ) ఉన్నారు. స్నాతకోత్సవంలో పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, సిద్ధముని, హరి, ఫ్యాకల్టీ డీన్లు సవరయ్య, త్యాగరాజు, మల్లికార్జున, కుమారస్వామి, బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు. -
మానవాళి సమస్యలకు వర్సిటీలు పరిష్కారం చూపాలి
- టిబెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మాజీ వీసీ - ఎస్వీయూలో వీసీల సదస్సు ప్రారంభం.. 300 మంది వీసీల హాజరు తిరుపతి: దేశంలోని విశ్వవిద్యాలయాలు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని టిబెట్‌లోని సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ మాజీ వీసీ ప్రొఫెసర్ సాంథోంగ్ రిన్‌పచీ పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలో ఆదివారం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 91వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ‘స్వాతంత్య్రం అనంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై 3 రోజులు పాటు ఈ సదస్సు జరగనుంది. సదస్సును ప్రారం భించిన ప్రొఫెసర్ సాంథోంగ్ రిన్‌పచీ మాట్లా డుతూ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటు న్న అనేక సవాళ్లు మానవాళికి ప్రమాదకరంగా మారాయన్నారు. మనుషుల మధ్య అంతరా లు పెరిగాయన్నారు. ఊహించని యుద్ధాలు, తీవ్రవాదం ప్రపంచాన్ని శాసిస్తున్నాయని, వీటిని సైతం పలుదేశాలు వ్యాపార ధోరణితో స్వాగతిస్తున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. మతద్వేషాలు, మతోన్మాదాలు ప్రపంచాన్ని ఛిన్నాభి న్నం చేస్తున్నాయన్నారు. భారతదేశ ఐక్యత, విలువలను పెంపొందించేం దుకు విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐయూ అధ్య క్షుడు చహాన్ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధిలో వీసీ ల పాత్ర గణనీయమన్నారు. ఏఐయూ సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుకోవా లని సూచించారు. కామన్వెల్త్ విశ్వవిద్యాల యాల అసోసియేట్ డిప్యూటీ సెక్రటరీ జాన్ కిర్క్ల్యాండ్, యూరో పియన్ యూనియన్ డిప్యూటీ మినిçస్టర్ సిసర్ ఓన్స్టినీ, ఎస్వీయూ వీసీ దామోదరం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు, ఎస్వీయూ రెక్టార్ భాస్క ర్, రిజిస్టార్ దేవరాజులు, పాలక మండలి సభ్యుడు గురు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం నుంచి మొదలు కావాల్సిన యూజీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 8 వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతన పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 26 నుంచి http://www.svuniversity.ac.in/ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.