నెల్లూరు: మరో బ్యాంకు చోరీకి విఫలయత్నం జరిగింది. జిల్లాలోని కావలి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి చొరబడిన కొందరు దుండుగులు చోరీకి యత్నించారు. తొలుత బ్యాంకు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన ఆ దుండగులు చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించారు.. అయితే బ్యాంకు లాకర్ తెరుచుకోకపోవడంతో ఆ దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు.