
సోషల్ మీడియా విరివిగా వాడండి: బొత్స
ప్రత్యర్థుల మాటలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్లొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు సోషల్ మీడియాపై అవగాహన శిక్షణ తరగతులను బుధవారం గాంధీభవన్లో ఆయన ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన పార్టీ వర్గాలను తెలిపారు. సోషల్ మీడియా అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా వివరించారు. సోషల్ మీడియాపై అవగాహాన పెంచుకోవాలని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అన్నిశ్రేణులు పిలుపునిచ్చారు.