ఆ తల్లుల కళ్లల్లో ఆనందం: మంత్రి | Vellampalli Srinivas And MLA Malladi Vishnu Visits Vijayawada | Sakshi
Sakshi News home page

ఆ తల్లుల కళ్లల్లో ఆనందం: మంత్రి

Published Sat, Jan 11 2020 2:39 PM | Last Updated on Sat, Jan 11 2020 3:50 PM

Vellampalli Srinivas And MLA Malladi Vishnu Visits Vijayawada  - Sakshi

సాక్షి, విజయవాడ: జనం కోరుకున్న ప్రజారంజక పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం వించిపేటలోని 36వ డివిజన్‌లో మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్నిపల్‌ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అమ్మఒడి కార్యక్రమం ద్వారా అబ్ధి పొందిన పేద విద్యార్థుల తల్లుల కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు. గత టీడీపీ నాయకులు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నారు. వార్డు వాలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని, ఆయన అందిస్తున్న సంక్షేమ పాలనతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఔ

ఇక శాంతి నగర్‌ 57వ డివిజన్‌లో పర్యంచిన సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రోడ్డు మార్గాలు, డ్రైనేజీ, వీధి దీపాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. అమ్మఒడి ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement