‘బాబు..జాబు’ అన్నావ్ ఇదేనా | venkata ramana takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

‘బాబు..జాబు’ అన్నావ్ ఇదేనా

Published Sat, Jul 12 2014 2:19 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

‘బాబు..జాబు’ అన్నావ్ ఇదేనా - Sakshi

‘బాబు..జాబు’ అన్నావ్ ఇదేనా

పాతపట్నం: బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మించి యువత ఓట్లతో గెలిచిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక  శాసనసభ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 29 వేల మంది ఆదర్శ రైతులను 3 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను ఒక్క నెలలోనే తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న ఐదేళ్లలో ఇంకె ంతమందిని తొలిగిస్తారోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు చెప్పినట్లే అధికారులు నడుచుకుంటూ రేషన్ డీలర్లపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్‌ఎన్ పేట మండలంలో టీడీపీ నాయకుల ఒత్తిడికి లొంగి స్వయంశక్తి సంఘాలు నడుపుతున్న ఆరు రేషన్ డిపోలను ఎటువంటి విచారణ, నోటీసులు జారీ చేయకుండా తొలగించడం అన్యాయమన్నారు.
 
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న దృష్ట్యా వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించాలన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని, గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుదల లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండాల అర్జునుడు, గంగు వాసుదేవరావు, రేగేటి షణ్ముఖరావు, బంకి నరసయ్య, సిర్ల ప్రభాకరరావు, శివాల చిన్నయ్య, కొమరాపు రాము, శిష్టు తారకరామారావు, నల్లి లక్ష్మణరావు, ఇప్పిలి సింహాచలం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement