
ఉడా వీసీగా శ్రీకాంత్
వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్‌గా నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్‌గా నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత వీసీ పి.ఉషాకుమారి బదిలీ కాగా, ఆమెకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండు వారాల క్రితమే సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్‌గా నియమితులైన శ్రీకాంత్ వివిధ కారణాలు, సింగపూర్ బృందం హడావుడి కారణంగా ఆ బాధ్యతలు చేపట్టలేదు. ఈ క్రమంలో సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ బాధ్యతతో పాటు ఉడా వైస్ చైర్మన్‌గా కూడా ఆయన్నే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు వీజీటీఎం ఉడా సాంకేతికంగా రద్దు కాలేదు.