సాక్షి, విశాఖపట‍్నం : నగరంలో నిర్వహించనున్న అగ్రిహ్యాక్‌థాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నేడు విశాఖకు రానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరాష్ట్రపతి ముందుగా అనుకున్నట్టుగా మంగళవారం సాయంత్రం కాకుండా మధ్యాహ్నం 1.40 గంటలకు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనునున్నారు.
- మధ్యాహ్నం 1.40 నుంచి 1.50 వరకూ స్వాగత కార్యక్రమం నిర్వహిస్తారు.
- మధ్యాహ్నం 1.50 గంటలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 2.10 గంటలకు సాగర్‌నగర్ వెళ్లనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు.
- సాయంత్రం 5 గంటలకు సాగర్‌నగర్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్‌లో ఉన్న నివాసానికి 5.15 గంటలకు ఉప రాష్ట్రపతి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.
- ఉప రాష్ట్రపతి 15వ తేదీ ఉదయం 10.40 గంటలకు కిర్లంపూడి లేఅవుట్ నుంచి బయలుదేరి ఏపీఐఐసీ మైదానానికి 11 గంటలకు చేరుకోనున్నారు.
- మధ్యాహ్నం ఒంటిగంట వరకు అగ్రిగిహ్యాక్‌థాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
- 1.15 గంటల నుంచి సాయంత్రం 4 వరకూ సాగర్‌నగర్‌లో మధ్యాహ్న భోజనం, విశ్రాంతి తీసుకోనున్నారు.
- సాయంత్రం 4 గంటలకు సాగర్‌నగర్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి 4.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- వీడ్కోలు కార్యక్రమం అనంతరం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రయాణమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment