ఆ ఎస్ఐ బారి నుంచి రక్షించండి మహాప్రభో.. | vidapanakallu SI harassing me, says ysr congress leader ramanjaneyulu | Sakshi
Sakshi News home page

ఆ ఎస్ఐ బారి నుంచి రక్షించండి మహాప్రభో..

Published Wed, Mar 19 2014 9:58 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

బాధితుడు రామాంజనేయులు - Sakshi

బాధితుడు రామాంజనేయులు

*రౌడీ షీటర్ అంటూ వేధిస్తున్నారు..
*లాఠీతో కుళ్లబొడిచారు..
* విలేకరుల ఎదుట వైఎస్సార్ సీపీ నాయకుడి గోడు
 
విడపనకల్లు  ‘నీవు రౌడీ షీటర్‌వి.. కనుక ఎన్నికలు పూర్తయ్యే వరకు రోజూ పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టి వెళ్లాలి.. రాకపోతే నీ ఇష్టం.. ’ అంటూ విడపనకల్లు ఎస్‌ఐ శివ తనను బెదిరిస్తూ, స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ హింస పెడుతున్నాడని, అలాగే తనను లాఠీతో కుళ్లబొడిచారని వైఎస్సార్ సీపీ నాయకుడు, అనంతపురం జిల్లా విడపనకల్లు ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోదుపల్లి రామాంజనేయులు వాపోయాడు.

మండలంలో టీడీపీ వారిలో ఎందరో ఎన్నికల్లో ఇబ్బందులు పెడుతున్న వారున్నా.. వదిలేసి.. కేవలం వైఎస్సార్ సీపీ వారినే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొట్టాలపల్లిలో టీడీపీ నాయకులు అనేక మంది ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడుతుంటే.. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే బైండోవర్ చేయిస్తూ అవస్థలు పెడుతున్నారని లబోదిబోమన్నాడు.

ఈ చిత్రహింసల్ని తాను భరించలేకున్నానని, ఎస్ఐ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామనిపిస్తోందని అన్నాడు. తన భార్యాపిల్లలందరూ ఎస్‌ఐ తీరుతో భయుభ్రాంతులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. సదరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను  వేడుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement