vidapanakallu
-
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద వాహనాల తనిఖీలు
-
అబ్బాయి చేతిలో బాబాయి హత్య
విడపనకల్లు : పాల్తూరులో దారుణం జరిగింది. అబ్బాయి చేతిలో బాబాయి హత్యకు గురయ్యాడు. టైరుబండిపై నిద్రిస్తుండగా కర్రతో బలంగా బాది కడతేర్చాడు. అనంతరం కర్ణాటకకు పారిపోతుండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విడపనకల్లు పాల్తూరులో అక్కంగారి పెద్ద వన్నప్ప (55) హత్యకు గురయ్యాడు. ఇంటి రస్తా వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 2013లో ఇంటి రస్తా విషయమై పెద్ద వన్నప్పతో తమ్ముడి కుమారుడైన వన్నూరుస్వామి అలియాస్ సుస్తిగాడు గొడవపడ్డాడు. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇదే విషయమై తగాదాలు జరుగుతుండేవి. పథకం ప్రకారమే.. వన్నూరుస్వామి పచ్చి తాగుబోతు. రస్తా వివాదం లేకుండా చేసుకోవాలంటే చిన్నాన్నను అడ్డు తొలగించుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. శనివారం తెల్లవారుజాము సమయంలో కొత్తపోలీస్స్టేషన్ దగ్గర గల వాముదొడ్డిలో టైరుబండిపై పడుకుని ఉన్న పెద్దవన్నప్పపై బండి గూటము(కట్టె)తో దాడిచేశాడు. తలపై బలమైన దెబ్బ తగలడంతో పెద్దవన్నప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. కొన్ని గంటల తర్వాత అటువైపు వచ్చిన వారు గమనించి మృతుడి భార్య, కుమారులకు సమాచారమందించారు. రంగంలోకి డాగ్ స్క్వాడ్ : అనంతపురం నుంచి ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఎస్ఐ వెన్నీల ఆధ్వర్యంలో డాగ్ స్క్వాగ్ బృందంతో పరిశీలించారు. హత్య చేసిన నేరస్తుడి ఇంటి వద్ద పోలీసు జాగిలాలు ఆగిపోయాయి. సంఘటన స్థలాన్ని ఉరవకొండ సీఐ చిన్న గౌస్, పాల్తూరు, ఉరవకొండ ఎస్ఐలు ఖాన్, జనార్దన్‌నాయుడు పరిశీలించారు. హత్యకు కారణమైన ఆయుధం (కట్టె)ను కూడా పరిశీలించారు. పోలీసుల అదుపులో నిందితుడిని నిందితుడు కర్ణాటక వైపు వెళుతున్నాడన్న సమాచారం అందడంతో సీఐ చిన్నగౌస్ తన సిబ్బందితో వెళ్లి హావళిగి వద్ద వన్నూరుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నాన్నను తానే హత్య చేశానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
‘అనంత’లో భారీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఖరీఫ్ సీజన్లో తొలిసారిగా అనంతపురం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 63 మండలాల్లో వర్షం కురవగా ఒకే రోజు 25.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాయదుర్గం, రొద్దం, పుట్లూరు తదితర ఐదారు మండలాల్లో కర్బూజా, కళింగర, ఆముదం, మిరప, టమాట లాంటి పంటలు స్వల్పంగా దెబ్బతినడంతో రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కురిసిన మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లడంతో అక్కడక్కడ చెరువుల్లో రెండు మూడు నెలలకు సరిపడా వర్షపు నీరు చేరడంతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి పంటలతో పాటు ఇటీవల వేసిన ప్రత్యామ్నాయ పంటలకు ఈ వర్షాలు ఊరటనిస్తాయని అధికారులు చెబుతున్నారు. పశుగ్రాసం సమస్య, పట్టు, పండ్లతోటలకు కొంత ఉశమనం కలిగించాయి. మొత్తం మీద సోమందేపల్లి మండలంలో అత్యధికంగా 71.6 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 40 మి.మీ నమోదైంది. -
కురుబలు రాజకీయంగా ఎదగాలి
విడపనకల్లు : కురుబలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడమే కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు వశికేరి లింగమూర్తి కోరారు. ఎక్కువ మంది కురుబ కులస్తులు ఉన్న జిల్లా, అనంపురం జిల్లా అన్నారు. కురబలకు ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం విడపనకల్లు కురుబ సంఘం మండల అధ్యక్షుడిగా డొనేకల్లు రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈకార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా నాయకులు వశికేరి రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పార్టీలను అంటగడతారా ?
- ఇన్పుట్ సబ్సిడీలో అన్యాయం చేస్తే సహించం - 12న వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిస్తాం - ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విడపనకల్లు : రైతులకు పార్టీలు అంట గట్టి ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే వ్యవహరిస్తున్న వ్యవసాయాధికారుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం విడపనకల్లులో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారని, అధికారిగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ఇళ్లలో ఊడిగం చేస్తున్నారా అని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు చెప్పిన వారికి పంటలు హెక్టారు కన్నా తక్కువ ఉన్నా కూడా 2016 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రు.30 వేలు, రూ.29 వేలు, రూ.27 వేలు ప్రకారం మంజూరు చేశారన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి ఒకే ఇంట్లో 5 మంది ఉంటే అలాంటి వారికి కూడా ఒక్కొక్కరికీ రు. 30 వేల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న రైతులకు మాత్రం 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా రూ.3 వేలు, రూ. 5 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇన్పుట్ సబ్సీడీ మంజూరు చేశారని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయాలే తప్పా రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. డొనేకల్లు, ఆర్.కొట్టాల గ్రామాల్లో దాదాపు 1500 మంది రైతులు ఉంటే టీడీపీకీ అనుకూలంగా ఉన్న 600 మంది రైతులకు మాత్రమే రు. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి, మిగతా రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. అధికారుల తప్పుడు గా తయారు చేసిన ఇన్పుట్ సబ్సిడీ జాబితాను సరిచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసేలా ఈ విషయాన్ని వ్యవశాయ జేడీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరించి ‡రైతులకు అన్యాయం చేస్తే మీరే బలి కావాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. గతంలో కూడా వ్యవసాయాధికారులు హావళిగిలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీనా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ నాయకులు గోపాల కృష్ణ, డొనేకల్లు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
కట్టెల కోసం వెళ్లి శవమయ్యాడు...
ఉరవకొండ: అనంతపురంజిల్లా విడపనకల్లు మండలం పరిధిలోని ఉండబండ గ్రామానికి చెందిన కూలీ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం రంగస్వామి అనే కూలీ కట్టెలు కొట్టుకురావడానికి వెళ్లాడు. రాత్రి అయినా భర్త రాకపోవడంతో ఆమె బంధువులతో కలిసి గాలించింది. రెండు రోజుల పాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు శుక్రవారం ఉదయం కొందరు గ్రామస్తులకు గ్రామం సమీపంలోని పొలం వద్ద ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రంగస్వామి కట్టెలు కొట్టేందుకు చెట్టుపైకి ఎక్కాడని, చెట్టుపై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలను గమనించక పోవడంతో అవి తగిలి విద్యుదాఘాతానికి గురై చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఎస్ఐ బారి నుంచి రక్షించండి మహాప్రభో..
*రౌడీ షీటర్ అంటూ వేధిస్తున్నారు.. *లాఠీతో కుళ్లబొడిచారు.. * విలేకరుల ఎదుట వైఎస్సార్ సీపీ నాయకుడి గోడు విడపనకల్లు ‘నీవు రౌడీ షీటర్వి.. కనుక ఎన్నికలు పూర్తయ్యే వరకు రోజూ పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టి వెళ్లాలి.. రాకపోతే నీ ఇష్టం.. ’ అంటూ విడపనకల్లు ఎస్ఐ శివ తనను బెదిరిస్తూ, స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ హింస పెడుతున్నాడని, అలాగే తనను లాఠీతో కుళ్లబొడిచారని వైఎస్సార్ సీపీ నాయకుడు, అనంతపురం జిల్లా విడపనకల్లు ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోదుపల్లి రామాంజనేయులు వాపోయాడు. మండలంలో టీడీపీ వారిలో ఎందరో ఎన్నికల్లో ఇబ్బందులు పెడుతున్న వారున్నా.. వదిలేసి.. కేవలం వైఎస్సార్ సీపీ వారినే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొట్టాలపల్లిలో టీడీపీ నాయకులు అనేక మంది ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడుతుంటే.. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే బైండోవర్ చేయిస్తూ అవస్థలు పెడుతున్నారని లబోదిబోమన్నాడు. ఈ చిత్రహింసల్ని తాను భరించలేకున్నానని, ఎస్ఐ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామనిపిస్తోందని అన్నాడు. తన భార్యాపిల్లలందరూ ఎస్ఐ తీరుతో భయుభ్రాంతులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. సదరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నాడు.