
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఉల్లిని అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఉల్లి బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహాత్మగాంధీ హోల్‌సేల్ కయర్షియల్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఉల్లిని నిల్వచేసిన 100వ షాపు నెంబరుకు ఎలాంటి లైసెన్సు లేకపోవడంతో అధికారులు షాపును సీజ్ చేశారు. స్టాక్‌లో ఉన్న ఉల్లిని బయటకు తీసుకొచ్చి మార్కెట్ ధరకు అమ్ముడయ్యేలా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment