
సాక్షి, అమరావతి: ‘వ్యవస్థ ఏదైనా అందులోకి ముందుగా తన వాళ్లను చొప్పించడం. తనకు అనుకూలంగా దాన్ని నాశనం చెయ్యడం. నిత్యం అనుకూల పత్రికలు, టీవీల్లో కనిపిస్తూ ఏదో పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం లాంటి టక్కుఠమారాలన్నీ జనానికి తెలిసిపోయాయి’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ మీ సంగతి పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. (కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ సమీక్ష)
క్వాలిటీ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగం ప్రాధాన్యతను తెలుసుకున్నారంటూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్లో తెలిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను అందించేందుకు తీసుకున్న నిర్ణయాల్లో జగనన్న విద్యా కానుక కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ పథకం కింద స్కూళ్లు తెరిచిన తొలి రోజే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫారం, పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు అందిస్తుందని వెల్లడించారు. (చావుల నుంచి బయటపడ్డ న్యూయార్క్!)
Comments
Please login to add a commentAdd a comment