సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా మహమ్మారిని తరిమేసే వరకు పోరాడాల్సిందేనని ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. 'చైనా నుంచి ప్రపంచమంతా వ్యాపించింది. కరోనా వైరస్కు కులాలు, మతాలు లేవు. ఎవరికైనా సోకవచ్చు. తమ ప్రాణం పోవాలని ఎవరూ అనుకోరు. కొద్దిమందిని అనుమానించి దోషులుగా చూడొద్దు. అందరం సంఘటితంగా నిలబడి ఎదుర్కోవాల్సిన సమయమిది. ఈ మహమ్మారిని తరిమేసే వరకు పోరాడాల్సిందే.
సామాజిక దూరం పాటించాలి. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటే తప్ప కరోనాను నియంత్రించలేం. మహారాష్ట్రలో కరోనా మూడో స్టేజికి వెళ్లినట్టు అక్కడ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరినీ కలవకున్నా వ్యాధి సోకినట్టు గుర్తించారు. మనకు అలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలంటూ' పేర్కొన్నారు.
(ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్' వివాదం)
Comments
Please login to add a commentAdd a comment