సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంలో గ్యాస్ లీక్ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందుతోంది. గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. ఆందోళన వద్దు. సహాయ చర్యల్లో ప్రభుత్వానికి సహకరిద్దామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. (గ్యాస్ లీక్.. అధికారులతో సీఎం జగన్ సమీక్ష)
గ్యాస్ లీక్ సమాచారం అందిన వెంటనే ఫైర్, పోలీసు, రెవెన్యూ, పారా మెడికల్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి అపార ప్రాణ నష్టాన్ని నివారించగలిగాయన్నారు. ప్రమాదం జరిగిన పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వారిని అభినందించారు.
సంబంధిత వార్తలు :
మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు
గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా
గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి
గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి..
Comments
Please login to add a commentAdd a comment