
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ ఉద్యోగ తొలి రోజు పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 11,58,538 మంది హాజరు కాగా, 95,436 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.50శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరంలో 93.60, శ్రీకాకుళం 93.47, పశ్చిమ గోదావరి 93.46, తూర్పు గోదావరి 92.71, విశాఖపట్నం 92.48, కృష్ణా 89.36, గుంటూరు 91.73, ప్రకాశం 91.56, నెల్లూరు 93.05, చిత్తూరు 93.21, కర్నూలు 91.97, వైఎస్సార్ జిల్లా 93.21, అనంతరపురం 92.67శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment