‘‘ఆంధ్రా ప్రాంతం వారి పాలనలో తెలంగాణ పల్లెలు వివక్షకు గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మనం చెల్లించిన పన్నులు మనమే వినియోగించుకోవచ్చు. దీంతో చిన్న గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. ప్రతి పల్లెకు రవాణా, వైద్య సౌకర్యాలు పెరుగుతాయి. విద్యుత్ కష్టాలు కూడా చాలావరకు తీరుతాయి.’’- కోదాటి శ్యాంసుందర్, పంచాయతీరాజ్
సివిల్ ఇంజినీర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
- న్యూస్‌లైన్, మిర్యాలగూడ
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: ఆంధ్రా ప్రాంతం వారి వివక్షకు తెలంగాణ పల్లెలు గురయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మన నిధులు మనకే ఖర్చు చేసుకొని ప్రతి గ్రామానికి కృష్ణా మంచినీటిని సరఫరా చేసుకునే అవకాశం కలుగుతుంది. చిన్న చిన్న గ్రామాలు కూడా పంచాయతీలుగా ఏర్పాటు చేసుకొని నిధులు కేటాయించుకుంటే మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. కృష్ణానది జిల్లాలోనే ఉన్నా పక్కనే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలోని గ్రామాలకు కూడా కృష్ణా మంచినీటిని సరఫరా కావడం లేదు. తెలంగాణలో రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు.
తెలంగాణ పల్లెలపై నాటి నుంచి వివక్ష
తెలంగాణ పల్లెలపై నాటి నిజాం కాలం నుంచి కూడా వివక్ష కొనసాగుతోంది. పల్లెల్లో ఎలాంటి కనీస సదుపాయాలు కల్పించకుండా కేవలం పన్నులు వసూలు చేసేవారు. స్వాతంత్య్రం వచ్చి అరవై వసంతాలు పూర్తయినా తెలంగాణ పల్లెల్లో మంచినీరు కరువైంది. ఇక రోడ్లు, మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పాలకుల చేతిలో ఇక్కడి పల్లెలు మోసపోతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదు.
వైద్యం మెరుగుపడుతుంది..
గ్రామీణ ప్రజలకు మంచినీటితో పాటు వైద్య సదుపాయం చాలా ముఖ్యం. ప్రస్తుతం మండలానికి ఒక వైద్యశాల ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు సరైన వైద్యం అందడం లేదు. మారు మూల ప్రాంతాలలో కనీస సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మండలాలు పెరగడంతో పాటు చిన్న చిన్న గ్రామాలు కూడా పంచాయతీలుగా ఏర్పాటవుతాయి. దాంతో నిధులను సక్రమంగా వినియోగించుకోవచ్చు. ప్రతి గ్రామానికి వైద్య సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవచ్చు.
మన నిధులు మనకే...
Published Sat, Sep 14 2013 2:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement