సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చోటుచేసుకున్న విషవాయువు దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక ఎల్‌జీ పాలిమర్స్ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తమని తాము కాపాడుకోవడానికి అనేకమంది రోడ్ల పైకి పరుగులు తీసుకుంటూ వచ్చారు. చాలా మంది ఈ విషవాయువు ప్రభావంతో స్పృహ తప్పి రోడ్డుపైనే పడిపోయారు. వారందరిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన జరిగిన సమయంలో తాము అనుభవించిన బాధను కొంత మంది బాధితులు పంచుకున్నారు.
(గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్)
‘నేను చనిపోతా అనుకున్నాను. నేను ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. అందరు తమ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీశారు. చాలా మందిని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని విశాఖ గ్యాస్ లీకేజీ నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక మహిళ తెలిపింది. మరో బాధితురాలు మాట్లాడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పిల్లలు తాను నిద్రలేచామని, చూసేటప్పటికి పరిస్థితి అంతా అమోయమంగా ఉందని తెలిపింది. ఆ గందరగోళంలో పిల్లలు తన నుంచి తప్పిపోయారని, తరువాత స్పృహ కోల్పొయానని తెలిపింది. కళ్లు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నాని, ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపింది. (ఏంటిదా గ్యాస్.. పీల్చితే ఏమవుతుంది?)
‘మాకు ఒకరకమైన వాసన వచ్చింది. మాకు మంటలు కూడా కనిపించాయి. ఆ సమయంలో మాకు కడుపుతో తిప్పినట్లు అనిపించి వాంతులు కూడా అయ్యాయి. అసలు ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. తరువాత మేం హాస్పటల్‌కి చేరుకన్నాం’ అని మరో భాదితులు తెలిపారు. అయితే అక్కడ ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి సైరన్‌ను మ్రోగించడంతో అందరూ రోడ్లపైకి వచ్చేశారు. దీని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు కాల్వలో పడి మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు, ప్రభుత్వ సిబ్బంది ఆంబులెన్స్‌ల ద్వారా చాలా మందిని ఆసుపత్రికి తరలించారు. ప్లాంట్‌కి దగ్గరలో ఉన్న ఐదు గ్రామలపై ఈ గ్యాస్ ప్రభావం అధికంగా పడింది. (మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు)
Comments
Please login to add a commentAdd a comment