సాక్షి, అమరావతి : కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించింది. దినపత్రికల్లో ఈ వార్తను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. (కష్టకాలంలో కొండంత ధైర్యమిచ్చారు)
సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ, ఈ సహాయం వెంటనే కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా రూ.10వేలు అందించారు. (రూ. 1,299.14 కోట్ల పింఛను ఒక్కపూటలో పంపిణీ )
Comments
Please login to add a commentAdd a comment