సాక్షి, కర్నూల్: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
- 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
- www.ceoandhra.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
- జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్ ఇన్‌చార్జ్ లక్ష్మిరాజు : 9704738448
- మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.
- ప్రతి శనివారం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
కర్నూల్ : మీ ఓటు ఉందా.. ఇప్పుడే చెక్ చేసుకోండి.
Published Fri, Mar 15 2019 11:04 AM | Last Updated on Fri, Mar 15 2019 11:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment