form-6
-
కర్నూల్ : మీ ఓటు ఉందా.. ఇప్పుడే చెక్ చేసుకోండి.
సాక్షి, కర్నూల్: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్ ఇన్చార్జ్ లక్ష్మిరాజు : 9704738448 - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - ప్రతి శనివారం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. - ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
వరంగల్ : మీ ఓటు ఉందా.. చెక్ చేసుకోండి..
సాక్షి, వరంంగల్ : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. - ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ చివరి గడువు. -
ఎంతో పని.. ఎన్నొబాధ్యతలు
సాక్షి, అచ్చంపేట / కల్వకుర్తి టౌన్ : మనది ప్రజాస్వామ్య దేశం. ఓటరు తన ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకొని పీఠం ఎక్కించగలిగే సత్తా ఉంది. ఈ అధికారాన్ని ఓటర్లకు రాజ్యాంగం కల్పించింది. అలాంటి విలువైన ఓటును వేయాలంటే దాని వెనుక ఎంతో మంది అధికారుల కృషి ఉంటుంది. గ్రామస్థాయిలో బూత్‌లెవల్ అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవుతాయి. అధికారుల్లో సమన్వయం లోపిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాల దాఖలు నుంచి పోలింగ్,ఎన్నికల నియమావళి అమలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరించే వరకు అధికారులు బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. మరి ఏ అధికారికి ఏయే బాధ్యతలు, అధికారాలు ఉంటాయో తెలుసుకుందామా?! జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవరిస్తారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లును పర్యవేక్షించడం, నామినేషన్ల ప్రక్రియ, ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియమించడం, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటిప్పుడు అప్రమత్తంగా ఉంచడం తదితర కార్యక్రమాల్లో జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి పాత్ర ఎంతో ఉంటుంది. సెక్టోరియల్ అధికారి 8 నుంచి10 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించే అధికారాలు వీరికి ఉంటాయి. ఓటర్ల నమోదు జాబితాను తయారు చేయడం ఈ అధికారి ప్రధాన కర్తవ్యం. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రధాన ఎన్నికల అధికారి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈఅధికారిని నియమిస్తుంది. ఆ అధికారి సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. నామినేషన్ ప్రక్రియ, తుది జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లండి వంటి అన్ని అంశాలు ఈ అధికారి పర్యవేక్షణలో జరుగుతాయి. బూత్ లెవల్ అధికారి కొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు అవసరమైన పారాలు ఇవ్వడం, అర్హుల ఓటు నమోదు చేసుకునేలా చూడటం, ఓటరు జాబితాలు ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాద్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం చేస్తారు. వీఆర్ఓలు, కారోబార్లు, అంగన్వాడీ టీచర్లు బూత్‌లెవల్ అధికారులుగా వ్యవరిస్తారు. ప్రిసైడింగ్ అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారిదే పూర్తి బాద్యత. ఎన్నికలకు అవరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, ఎన్నికల ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూంలకు చేర్చే వరకు ఈ అధికారి బాద్యత వహిస్తారు. వీరికి సహాయంగా సహాయ ప్రిసైడింగ్ అదికారులు ఉంటారు. పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యకలాపాలు వీరి పర్యవేక్షణలో జరుగుతాయి. సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల నిర్వహణ జరిగిన తీరు, సంబంధిత పర్యవేక్షణపై నివేదికను రూపొందించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపిస్తారు. దివ్యాంగులకు ఫెసిలిటేటర్లు.. ఈసారి దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనువుగా పోలింగ్ బూత్‌ల వద్ద ట్రైసెకిళ్లతో పాటు ఫెసిలిటేర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫెసిలేటర్లుగా ఆశ వర్కర్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వ్యవహరిస్తారు. -
ఓ(పో)టెత్తిన యువత
మంచిర్యాలఅగ్రికల్చర్: యువజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఓటుహక్కు వినియోగంపై యువతలో చైతన్యం పెరిగింది. ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం రెండుసార్లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ నెల 9న చివరి గడువు ముగిసే నాటికి జిల్లావ్యాప్తంగా 44,160 మంది ఓటరుగా నమోదుకావడం విశేషం. తాజాగా 15,017 మంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు పొందడం కోసం ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎన్నికల సంఘం రెండోసారి అవకాశం కల్పించగా, ఈ నెల 9వ తేదీతో గడువు ముగిసింది. జిల్లావ్యాప్తంగా 15,017 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పదిహేను రోజుల పాటు ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా యువతీ యువకులు ఓటుహక్కు కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల చూస్తే అత్యధికంగా బెల్లంపల్లిలో 6,647 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత మంచిర్యాలలో 5,850, చెన్నూర్‌లో 2,520 మంది నమోదు చేసుకున్నారు. ఓటుహక్కు నమోదుకు ఫారం–6, ఓటరు జాబితాలో తొలగింపు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఫారం–7 దరఖాస్తులు 4,509 రాగా, ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు చేసుకునేందుకు ఫారం–8 దరఖాస్తులు 1,552 వచ్చాయి. అదే నియోజకవర్గ పరిధిలో చిరునామా మార్చుకునేందుకు ఫారం–8ఏ దరఖాస్తులు 863 వచ్చాయి. ఎన్నికల అధికారులు సెప్టెంబర్ 10న ఆవిష్కరించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 5,01,743 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో ఎన్నికల సంఘం మరో నెలరోజులు కొత్త ఓటర్ల నమోదు అవకాశం కల్పించింది. జిల్లాలో ఓటరు నమోదుపై చైతన్యం కల్పించేందుకు బూత్ స్థాయి అధికారులు ర్యాలీలు, సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు. దీంతోపాటు ఓటరు జాబితాలో తప్పొప్పులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అధికారులు చనిపోయిన వారి పేర్లను తొలిగించి, తప్పులను సరిచేసి ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికల ఆధారంగా చనిపోయిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించి, కొత్తగా నమోదైన ఓటర్లతో తుది ఓటరు జాబితాలో 5,30,886 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరడంతో ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఇచ్చింది. తాజాగా వచ్చిన దరఖాస్తుల అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నట్లయితే ఓటరు జాబితాలో చోటు లభిస్తుంది. -
పురుషులదే పైచేయి!
సాక్షి, నవాబుపేట: మండలంలో నవాబులదే పైచేయి. మండల ఓటర్ల సంఖ్యలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. మండలంలోని మొత్తం 46 పోలింగ్ కేంద్రాల్లో 33,200 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 16,963 మంది పురుషులు, 16,232 మంది మహిళలున్నారు. 731 మంది ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా గతంలో 40 పోలింగ్ కేంద్రాలు ఉండగా తాజాగా మరో 6 కేంద్రాలు నవాబుపేట, చౌడూర్, అమ్మాపూర్, కారుకొండ గ్రామాల్లో అదనంగా ఏర్పాటు చేశారు. ఖానాపూర్ పోలింగ్ కేంద్రం జడ్చర్ల మండలంలో చేరడంతో మండలంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 45కు చేరింది. గత ఎన్నికల్లో మండలంలో 40 పోలింగ్ కేంద్రాల్లో 36,487 మంది ఓటర్లు ఉండగా.. ఈసారి దాదాపు 3 వేల మంది ఓటర్లు తగ్గడం విశేషం. అలాగే నియోజకవర్గం మొట్టమొదటి పోలింగ్ కేంద్రం మండలం నుంచే ప్రారంభం కావడం గమనార్హం. పోలింగ్ కేంద్రాలు మొత్తం ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లోనే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా కేంద్రాలకు అన్ని వసతులపై ఇప్పటికే మండల అధికారుల బృందం పరిశీలన చేసింది. ఇక వికలాంగులు, దివ్యాంగులు ప్రత్యేకంగా ఓటు వేసేందుకు అనువైన పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. గ్రామాల వారీగా ఇలా.. మండలంలోని ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లు ఇలా ఉన్నారు. కొల్లూరు ఒకటో పోలింగ్ కేంద్రంలో 1,245 మంది ఓటర్లు, రెండో కేంద్రంలో 975 మంది, మూడో కేంద్రంలో 700 మంది, పోమాల్ నాలుగో కేంద్రంలో 739 మంది, ఐదో కేంద్రంలో 489 మంది, ఆరో కేంద్రంలో 1,041 మంది, చౌడూర్ ఏడో కేంద్రంలో 651 మంది, ఎనిమిదో కేంద్రంలో 568 మంది, తొమ్మిదో కేంద్రంలో 449 మంది, దేపల్లి పదో కేంద్రంలో 608 మంది, కాకర్‌జాల్ 11వ కేంద్రంలో 752 మంది, లింగంపల్లి 12వ కేంద్రంలో 1,009 మంది, రేకులచౌడాపూర్ 13వ కేంద్రంలో 808 మంది, లోకిరేవు 14వ కేంద్రంలో 1,043 మంది, అమ్మాపూర్‌లో 15వ కేంద్రంలో 732 మంది, 16వ కేంద్రంలో 602 మంది, కామారం 17వ కేంద్రంలో 851 మంది, గురుకుంట 18వ కేంద్రంలో 746 మంది, 19వ కేంద్రంలో 1,073 మంది, నవాబుపేట 20వ కేంద్రంలో 813 మంది, 21వ కేంద్రంలో 491 మంది, 22వ కేంద్రంలో 519 మంది, 23వ కేంద్రంలో 502 మంది, 24వ కేంద్రంలో 547 మంది, యన్మన్గండ్ల 25వ కేంద్రంలో 930 మంది, 26వ కేంద్రంలో 838 మంది, కొండాపూర్ 27వ కేంద్రంలో 619 మంది, 28వ కేంద్రంలో 709 మంది, హజిలాపూర్ 29వ కేంద్రంలో 789 మంది, రుద్రారం 30వ కేంద్రంలో 768 మంది, 31వ కేంద్రంలో 498 మంది, కాకర్లపహాడ్ 32వ కేంద్రంలో 854 మంది, 33వ కేంద్రంలో 743 మంది, తీగలపల్లి 34వ కేంద్రంలో 1,166 మంది, సిద్దోటం 35వ కేంద్రంలో 674 మంది, కారుకొండ 37వ కేంద్రంలో 639 మంది, 38వ కేంద్రంలో 504 మంది, 39వ కేంద్రంలో 538 మంది, హన్మసానిపల్లి 40వ కేంద్రంలో 457 మంది, కూచూర్ 41వ కేంద్రంలో 856, 42వ కేంద్రంలో 697 మంది, ఇప్పటూర్ 43వ కేంద్రంలో 641 మంది, 44వ కేంద్రంలో 488 మంది, 45వ కేంద్రంలో 964 మంది, కారూర్ 46వ పోలింగ్ కేంద్రంలో 857 మంది ఓటర్లున్నారు. తుది జాబితాలో చేరుస్తాం.. ఇటీవల ఇచ్చిన ఫారం–6 ఆన్లైన్లో నమోదు కొనసాగుతోంది. వీటిని ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తుది జాబితాలో చేరుస్తాం. కాగా పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన కొత్త ఓటర్ల నమోదును ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులచే విచారణ జరిపించి వాటిని తుది జాబితాలో చేరుస్తాం. ఇప్పటి వరకు మండలంలో 780 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. – రాజునాయక్, తహసీల్దార్, నవాబుపేట -
జిల్లాలో భారీగా పెరిగిన ఓటర్లు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: నూతన గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,53,288 గా నమోదైంది. మార్చి తొమ్మిది వరకు కొత్తగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను కలుపుకొని తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 48,523 మంది కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేరాయి. ఫిబ్రవరిలో అధికారికంగా ఓటర్ల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 18,04,765గా నమోదైంది. ప్రస్తుతం కొత్త ఓటర్లతో సంఖ్య పెరిగిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో 4,038 మంది, బోధన్ 4,289, జుక్కల్‌లో 3,083, బాన్సువాడలో 3,520, ఎల్లారెడ్డిలో 3,206, కామారెడ్డిలో 3,797, నిజామాబాద్ అర్బన్‌లో 14,511, నిజామాబాద్ రూరల్‌లో 7,189, బాల్కొండ నియోజకవర్గంలో 4,096 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. -
ఓటరవుదాం.. ఓటేద్దాం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటరుగా నమోదవం.. ఓటు హక్కును వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మంచి పాలకులు.. ప్రభుత్వాలు సాధ్యం. తద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న పండగలా నిర్వహిస్తోంది. శనివారం 4వ విడత కార్యక్రమ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటరు దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాంసృతిక కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఆసక్తి చూపని యువత ఓటరుగా నమోదయ్యేందుకు యువత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మొత్తం ఓటర్లలో 18, 19 ఏళ్ల యువత 3.66 శాతం ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 82వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో మార్పు తీసుకొచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకున్నా ఫలితం లేకపోయింది. పెరిగిపోతున్న బోగస్ ఓటర్లు జిల్లాలో బోగస్ ఓటర్లు గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. జనాభాలో ఓటర్లు 64.6 శాతం ఉండాలి. కానీ జిల్లాలో 69 నుంచి 70 శాతం ఉండటం గమనార్హం. 1000 మంది పురుష ఓటర్లకు 988 మంది మహిళా ఓటర్లు ఉండాల్సిన స్థానంలో.. మహిళలు 1010 మంది ఉండటం బోగస్‌కు నిదర్శనం. నేతల స్వార్థమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. నవంబర్ 18న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 28,39,987 మంది కాగా.. పురుషులు 14,12,951.. మహిళలు 14,27,036 మంది ఉన్నట్లు వెల్లడైంది. జిల్లాలో మొత్తం 1.83 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. ఇటీవల అధికారులు దాదాపు 60వేల బోగస్ ఓటర్లను తొలగించినా.. ఇప్పటికీ 1.24 లక్షల బోగస్ ఓటర్లు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారానే పోలింగ్ ఈ ఏడాది జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనే వినియోగించనున్నారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ఫిబ్రవరి నెల 20వ తేదీ తర్వాత ఏ రోజైనా వెలువడే అవకాశం ఉంది. త్వరలో జిల్లాకు కొత్త ఓటింగ్ యంత్రాలు రానున్నాయి. ఈవీఎంలను భద్రపరిచేందుకు కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపదికన రూ.1.05 కోట్లతో గోదామును నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఓటరు నమోదుకు ఎప్పుడైనా అవకాశం 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదయ్యేందుకు నిరంతరం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఫారం-6ను పూర్తి చేసి పంపవచ్చు. దీనిపై సందేహాలు ఉంటే 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్, ఇతరత్రా వివరాలు తెలుసుకునేందుకు 18004251110 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఓటర్లుగా నమోదైన వారు మీ సేవ కేంద్రాల్లో రూ.10 చెల్లించి ఫొటో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చు. -
ఓట్ల తొలగింపునకు పైరవీలు..!
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఓట్ల తొలగింపునకు అధికార నేతలు పైరవీలు ప్రారంభించారు. క్షేత్రస్థాయిల్లో సిబ్బందిని భయభ్రాం తులకు గురిచేస్తున్నారు. కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై అధికార యంత్రాంగానికి భారీగా దరఖాస్తులు అందాయి. వీటిపై ఇంటింటి విచారణ చేపట్టి ఈ నెల 16న తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది. ఇందుకు 13నాటికి అధికార యంత్రాం గం విచారణ పూర్తి చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా బోగస్ ఓట్లు గుర్తించడం, అర్హులైన వారికి ఓటు హక్కు దక్కేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే అధికార యంత్రాం గంపై రాజకీయ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉన్నా యి. విచారణ చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తహశీల్దా ర్లు సైతం నేతల ఒత్తిడికి భయపడుతున్నారు. జిల్లాలో భారీగా ఓట్లు నమోదు చేయించడం అధికార పార్టీ నేతలకే చెల్లింది. ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా అధికారులపై దాడులకు తెగబడటం, పదే పదే ఫిర్యాదులు చేయడంతో అధికారులు ఉత్తుత్తి విచారణ చేస్తే పోతుందనే ఆలోచనలో ఉన్నారు. దీంతో తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురణ కష్ట సాధ్యంగా మారనుంది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాజా ఫోటోలతో గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఆన్లైన్లో, మాన్యువల్ విధానంలో మొత్తం 2,66,254 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నారు. తొలగింపులు మాత్రం 24,251 దరఖాస్తులు అందాయి. సవరణలకు 29,478 దరఖాస్తులు, పోలింగ్ బూత్ మార్పులకు 7,192 దరఖాస్తులు స్వీకరించారు. వీటన్నిం టిని విచారించేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. అవకతవకలు అనేక రకాలుగా జరిగిన ఈ జాబితాపై సార్వత్రిక ఎన్నికల వేళ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏరేస్తారా.. వదిలేస్తారా.. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టోకున ఓట్ల చేర్పింపులు జరిగాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే తొలగింపులు చేశారు. ఊరూరా ఓట్లు మాయమయ్యాయి. గత నెల 18న అధికారులు ప్రకటించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో ఈ విషయం తేలింది. బోగస్ ఓట్లు అలాగే ఉంచి అర్హులైన వారి ఓట్లు తొలగించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తొలగింపులకు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయడం గమనార్హం. నియోజకవర్గాల్లో అసంబద్ధంగా అందిన చేర్పుల దరఖాస్తులపై కలెక్టరు రెవెన్యూ యంత్రాంగానికి ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నగరంలో చేరిక ఓట్లుకు అందిన దరఖాస్తుల్ని చూస్తే రెండు చోట్ల ఓట్లు పొందేందుకు దరఖాస్తు చేసినట్లుంది. ఈ దరఖాస్తుల్ని ఏరేసేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ వల్ల ఫలితం లేదని స్వయంగా అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ విచారణ నిర్వహించేందుకు సమయం సరిపోనందున బోగస్ ఓట్ల ఏరివేత ప్రహసనంగానే మారనుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక దరఖాస్తులు చేర్పుల (ఫారం-6) కోసం అందాయి. మొత్తం ఇక్కడ 32,002 దరఖాస్తులు అందడంపై చర్చనీయాంశమైంది. జిల్లాలో ఓ సీనియర్ మంత్రి గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఓట్ల నమోదు ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దూరదృష్టితో వ్యవహరించి ఎన్నికల అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బందిని ప్రభా వితం చేస్తున్నారని సమాచారం. గుంటూరు తూర్పులోనూ 23,788 దరఖాస్తులు చేర్పులకు అందాయి. గుంటూరు పశ్చిమలో తొలగింపుల దరఖాస్తులు 316 కాగా, తూర్పులో 68 కావడం విశేషం.