టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడు. టెక్కలి మండలం చాకిపల్లి వీఆర్వోగా పనిచేస్తున్న సాంబమూర్తి కుటుంబసభ్యులకు చెప్పకుండా రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
సోమవారం నౌపడా రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాంబమూర్తి కుటుంబసభ్యులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించటంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.