సాక్షి, అమరావతి: ‘ఇలాగైతే మీకు నీట్‌లో సీట్లు రావు, గీట్లు రావు.. మర్యాదగా కోచింగ్‌లో చేరి చదువుకోండి’ అంటూ ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులకు సీఎం పేషీ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఓవైపు ఫాతిమా కాలేజీ వ్యవహారమై ఎంసీఐతో చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్యా సంచాలకులు(అకడమిక్) డా.బాబ్జీ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చర్చలు జరుగుతుండగానే సీఎం పేషీకి చెందిన కొందరు అధికారులు ఫాతిమా విద్యార్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మర్యాదగా నీట్ కోసం కోచింగ్‌లో చేరండి. లేదంటే మీ కెరీర్ పాడవుతుంది’ అని బెదిరింపులకు దిగుతున్నారని బాధిత విద్యార్థులు వాపోయారు. మరోవైపు ఫాతిమా కాలేజీ యాజమాన్యం కూడా తమకు ఫోన్లు చేసి భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment