బాల్కొండ,న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌నుంచి రబీ పంటల కోసం సోమవారం అధికారులు నీటినివిడుదల చేశా రు. కాకతీయకాలువద్వారా ఉదయం రెండువే ల క్యూసెక్కులు వదిలిన అధికారులు సాయంత్రానికి మూడు వేల క్యూసెక్కులకు పెంచా రు. కాకతీయ కాలువ ద్వారా వారబందీ ప్రకారం పదిరోజులు నీటివిడుదల, ఐదు రో జులు నిలిపివేయాలని ప్రాజెక్ట్ నీటివిడుదల చే పట్టడానికి ప్రణాళిక రూపొందించినట్లు అధి కారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌నుంచి లక్ష్మీ కా లువ ద్వారా వంద క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్‌పూర్తి నీటి సామర్థ్యంతో నిండుకుండల ఉండటంతో ప్రాజెక్ట్ ఆయకట్టు మొత్తానికి రబీలో నీరందిస్తామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలేదు. ప్రా జెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90 అడుగుల నీరు నిల్వ ఉంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా 12 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్‌కో అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై సోమవారం కూడా ప ర్యాటకుల తాకిడి కొనసాగింది. ప్రాజెక్ట్ సందర్శనకు అనేక మంది యువకులు వచ్చారు. డ్యాంపై స్నేహితులతోకలిసి ఫొటోలు దిగారు.
రబీ పంటలకు నీటి విడుదల
Published Tue, Dec 24 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement