water releases
-
ట్రయల్ రన్ షురూ
సాక్షి, హైదరాబాద్/ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టానికి తెరలేచింది. తొలిసారిగా గోదావరి నీటితో ట్రయల్ రన్ ప్రక్రియ మొదలైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం ఉదయం ఎల్లంపల్లి బ్యారేజీ ఫోర్‌షోర్ నుంచి గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 కాల్వలకు విడుదల చేశారు. ఈ నీరు అప్రోచ్ చానల్ ద్వారా ప్యాకేజీ–6లో భాగంగా నిర్మిస్తున్న టన్నెళ్ల నుంచి సర్జ్పూల్కు చేరనుంది. అనంతరం ఇప్పటికే అమర్చిన మోటార్ల ద్వారా వెట్‌రన్ నిర్వహించి ఆ నీటిని నందిమేడారం రిజర్వాయర్‌కు తరలిస్తారు. గోదావరికి హారతి ఇచ్చి... ట్రయల్ రన్లో భాగంగా తొలుత పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేంనూర్ గ్రామ సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో నిర్మించిన రెగ్యులేటర్ వద్ద అధికారులు పూజలు నిర్వహించి గోదావరికి హారతి ఇచ్చారు. అనంతరం సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్రావు, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌లు ఎల్లంపల్లి ఫోర్‌షోర్ నుంచి 300 క్యూసెక్కుల నీటిని ప్యాకేజీ–6లోని ఇన్‌టేక్ రెగ్యులేటర్‌లో ఉన్న 5 గేట్లలో మూడో గేటుని 6 అంగుళాల మేర ఎత్తి అప్రోచ్ చానల్‌కు విడుదల చేశారు. ఈ నీటి విడుదలను క్రమంగా వెయ్యి క్యూసెక్కులకు పెంచుతూ వెళ్లారు. కిలోమీటర్ పొడవున్న అప్రోచ్ చానల్ ద్వారా ప్రవహించిన నీరు.. ట్రాష్ రాక్ గేట్ల ద్వారా 9.34 కిలోమీటర్ల పొడవున్న జంట టన్నెళ్లలోకి ప్రవేశించింది. ఈ నీరు నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌కి గురువారం ఉదయానికి చేరుకుంటుంది. టన్నెళ్లలోకి నీరు చేరిన తర్వాత ప్రతీ అంశాన్ని ఇంజనీర్లు క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో గుర్తిస్తారు. అలాగే ఇతర అవాంతరాలు ఏవైనా ఉంటే వాటిని కూడా గుర్తించి అప్పటికప్పుడు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తారు. ఈ నీరంతా సర్జ్పూల్కు చేరాక దాన్ని తొలుత 10 శాతం వరకు నింపుతారు. అనంతరం దశలవారీగా పూర్తి స్థాయిలో నింపనున్నారు. ఈ దశలోనూ ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేలా, లీకేజీలను గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. విడతల వారీగా సర్జ్‌పూల్ నింపాక 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా పంపింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. సర్జ్‌పూల్‌లో ఉన్న నీటితో ప్రతి మోటార్‌ను 20 నుంచి 30 నిమిషాలు రన్ చేసి చూస్తారు. అన్ని పంపులను వెట్‌రన్ చేసేందుకు సుమారు 0.20 టీఎంసీల నీరు అవసరం అవుతుందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. వీలైనంత మేర ఈ నెల 23 లేక 24న పంపుల వెట్‌రన్ నిర్వహిస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రకటించారు. అధికారుల సంబరాలు... కాళేశ్వరం ట్రయల్ రన్ నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. తాము పడిన కష్టానికి ఫలితం లభించడం సంతోషంగా ఉందని సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. మేడారం నుంచి మిడ్‌మానేరుకు, రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించి నీటిని సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవయుగ డైరెక్టర్ వెంకటరామారావు, జీఎం శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి
కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువ సాగునీటి విడుదలపై అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సాగునీటి వాటాను సాధించేందుకు ఆయకట్టు రైతులకు తాము అండగా నిలబడతామని ఆమె అన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రితో చర్చించి రైతులకు రబీ సీజన్‌కు సాగునీరు అందేలా చూస్తామని శోభానాగిరెడ్డి హామీ ఇచ్చారు. -
రబీ పంటలకు నీటి విడుదల
బాల్కొండ,న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నుంచి రబీ పంటల కోసం సోమవారం అధికారులు నీటినివిడుదల చేశా రు. కాకతీయకాలువద్వారా ఉదయం రెండువే ల క్యూసెక్కులు వదిలిన అధికారులు సాయంత్రానికి మూడు వేల క్యూసెక్కులకు పెంచా రు. కాకతీయ కాలువ ద్వారా వారబందీ ప్రకారం పదిరోజులు నీటివిడుదల, ఐదు రో జులు నిలిపివేయాలని ప్రాజెక్ట్ నీటివిడుదల చే పట్టడానికి ప్రణాళిక రూపొందించినట్లు అధి కారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్నుంచి లక్ష్మీ కా లువ ద్వారా వంద క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్‌పూర్తి నీటి సామర్థ్యంతో నిండుకుండల ఉండటంతో ప్రాజెక్ట్ ఆయకట్టు మొత్తానికి రబీలో నీరందిస్తామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలేదు. ప్రా జెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90 అడుగుల నీరు నిల్వ ఉంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా 12 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై సోమవారం కూడా ప ర్యాటకుల తాకిడి కొనసాగింది. ప్రాజెక్ట్ సందర్శనకు అనేక మంది యువకులు వచ్చారు. డ్యాంపై స్నేహితులతోకలిసి ఫొటోలు దిగారు. -
‘కాకతీయ’కు నిలిచిన నీటి విడుదల
బాల్కొండ, న్యూస్‌లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా అధికారులు ఆదివారం నీటి విడుదలను నిలిపి వేశారు. ఆయకట్టుకు నీటి అవసరం లేకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 రోజులు నీటి విడుదల నిలిపివేత, 9 రోజులు విడుదల కొనసాగించేల అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 550 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాలువల ద్వారా నీటి విడుదల నిలిచి పోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.70 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. నిలిచిన విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో ప్రాజెక్ట్ వద్ద ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.24 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. నిలకడగా రామడుగు ప్రాజెక్ట్ నీటిమట్టం ధర్పల్లి : మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1278.50 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా 100 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. కుడి కాలువ ద్వారా 100 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నారు. దీనికింద వాడి, చెంగల్, పచ్చల నడ్కుడ చెరువుల్లోకి నీటిని నింపుతున్నారు. ఎడుమ కాలువ ద్వారా కలిగోట్ గ్రామ చెరువును నింపుతున్నారు. 20 క్యూసెక్కూల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టు కింద చెరువులను నింపేందుకు కుడి, ఎడుమ కాలువల ద్వారా నీటిని వదులుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ దేవేందర్ తెలిపారు.